India U19 vs Japan U19: ఆసియా అండర్-19 ప్రపంచకప్‌లో భారత్ తొలి విజయాన్నందుకుంది. కెప్టెన్ మహ్మద్ అమాన్ 122 నాటౌట్ తో సెంచరీ సాధించడంతో.. క్రికెట్ పసికూన జపాన్ జట్టును 211 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించింది. టీమిండియా బ్యాటర్లలో ఆయుష్ మాత్రే 54, వైభవ్ సూర్యవంశీ 23, సిద్ధార్థ్ 35, కార్తికేయ 57పరుగులు సాధించారు. దీంతో భారత్ 6 వికెట్ల నష్టానికి 339 పరుగులు చేసింది. కాగా, ఛేదనలో జపాన్ తేలిపోయింది. చేతన్ శర్మ, హార్దిక్ రాజ్, కార్తికేయ తలో రెండు వికెట్లు తీయడంతో జపాన్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లకు 128 పరుగులే చేయగలిగింది. జపాన్ బ్యాటర్ హ్యూగో కెల్లీ 50 పరుగులతో హాఫ్ సెంచరీ చేశాడు. తొలి మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ చేతిలో ఓడిన భారత్ తన చివరి గ్రూప్ మ్యాచ్‌యూఏఈతో ఆడనుంది. ఒక్కో గ్రూప్‌లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీఫైనల్స్‌కు అర్హత సాధించనున్నాయి.
