ACB Raids:లంచగొండి అధికారులు రోజురోజుకూ ఉసిల్లలెక్క బయటకొస్తున్నారు. నిత్యం ప్రజలను లంచాలతో వేధించే ఆ లంచావతారులు ఏసీబీ వలలో రోజుకు కొంత మంది చొప్పున చిక్కుకొంటున్నారు. తెలంగాణలో పట్టువదలని విక్రమార్కుల వలే అక్రమార్కులపై వల పన్ని వారి భరతం పడుతున్నారు. మూడు రోజులు వ్యవధిలోనే తెలంగాణలో సుమారు 10 మంది అధికారులు ఏసీబీ అధికారులకు చిక్కారు. తాజాగా విద్యుత్తు శాఖలో ఓ జిల్లా అధికారి లంచం తీసుకుంటూ దొరికిపోయాడు.
ACB Raids:మహబూబాబాద్ జిల్లా విద్యుత్తు శాఖ ఎస్ఈ నరేశ్‌ను బుధవారం (జూన్ 18) ఏసీబీ అధికారులు లంచం తీసుకుంటుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఓ కాంట్రాక్టర్ నుంచి ఆయన లక్ష రూపాయలు డిమాండ్ చేశాడు. ఈ మేరకు ఆ కాంట్రాక్టర్ నగదును లంచంగా ఇస్తుండగా, వలవేసిన ఏసీబీ అధికారులు ఎస్ఈ నరేశ్‌ను పట్టుకున్నారు.