ACB: తెలంగాణలో ఫార్ములా–ఈ రేస్ కేసు మరోసారి రాజకీయ వేడి పెంచుతోంది. ఈ కేసులో మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు (కేటీఆర్)కు ఆంధ్రప్రదేశ్ అవినీతి నిరోధక విభాగం (ఏసీబీ) మరోసారి నోటీసులు జారీ చేసింది.
ఏసీబీ అధికారుల సమాచారం మేరకు, కేటీఆర్‌ను జూన్ 16 (సోమవారం) ఉదయం 10 గంటలకు విచారణకు హాజరుకావాలని ఆదేశించారు. ఫార్ములా–ఈ రేసు నిర్వహణలో జరిగిన అనుమానాస్పద లావాదేవీలు, నిధుల దుర్వినియోగంపై దర్యాప్తు కొనసాగుతోంది. ఇందులో కీలకపాత్రధారుడిగా కేటీఆర్‌ను భావిస్తున్నట్లు సమాచారం.
ఇంతకుముందు కూడా ఈ కేసులో పలువురికి నోటీసులు జారీ అయ్యాయి. అయితే ఈసారి కేటీఆర్‌కు నేరుగా విచారణకు హాజరు కావాలని కోరడం చర్చనీయాంశంగా మారింది. కేసు దర్యాప్తు వేగం పుంజుకోవడంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉద్విగ్నత నెలకొంది.
ప్రస్తుత రాజకీయ పరిణామాల మధ్య కేటీఆర్‌పై వచ్చిన ఈ నోటీసులు మరింత సంచలనం రేపుతున్నాయి.