AC Tips: వర్షాకాలం వచ్చింది అంటే… వేడి నుండి కొంత ఉపశమనం లభిస్తుంది. కానీ కొన్ని రోజుల్లో తేమ ఎక్కువగా ఉండడం వల్ల AC తప్పనిసరిగా మారుతుంది. ఇలాంటి సమయంలో ACను సురక్షితంగా వాడటానికి కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు తీసుకోవాలి.
స్టెబిలైజర్ తప్పనిసరి!
వర్షాకాలంలో ఎక్కువగా వోల్టేజ్ సమస్యలు వస్తుంటాయి. కరెంట్ ఒక్కసారిగా ఎక్కువైతే… లేక తగ్గితే, మీ AC పాడైపోయే ప్రమాదం ఉంటుంది. అందుకే ACకు మంచి స్టెబిలైజర్ అవసరం. ఇది కేవలం వర్షాకాలానికే కాదు, వేసవిలో కూడా చాలా ఉపయోగపడుతుంది.
అవుట్‌డోర్ యూనిట్‌కి కవరింగ్ అవసరం!
ACలో అవుట్‌డోర్ యూనిట్ చాలాముఖ్యమైనది. మీ యూనిట్ నేరుగా వర్షంలో ఉండకూడదు. వర్షపు నీరు దానిలోకి వెళ్లితే, AC భాగాలు పాడవుతాయి. అందుకే ఓ కవరింగ్ లేదా షెడ్ ఏర్పాటు చేయండి. వీళ్లతో ACకు లాంగ్ లైఫ్ ఉంటుంది.
ఇది కూడా చదవండి: Body Smell: శరీర దుర్వాసనకు కారణమేమిటో మీకు తెలుసా? ఖర్చు లేకుండా ఇలా చేయండి..
పవర్ కట్ అయితే AC ఆపేయండి!
వర్షాకాలంలో విద్యుత్ అంతరాయాలు సాధారణమే! కరెంట్ మధ్యలో పోతే, మీ ACలోని భాగాలు పాడవుతాయి. కరెంట్ పోతుంటే వెంటనే AC ఆఫ్ చేయండి. వెనకబడిన ఓన్ చేయడం వల్ల మరింత నష్టం వస్తుంది.
మొత్తం మీద…
కొంచెం జాగ్రత్తలు పాటిస్తే, మీ AC సురక్షితంగా ఉంటుంది. మీరు వేల రూపాయలు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉండదు!