Aadarsha Kutumbam47

Aadarsha Kutumbam: వెంకటేశ్‌, త్రివిక్రమ్‌ ‘ఆదర్శ కుటుంబం’ విడుదల వాయిదా

Aadarsha Kutumbam: విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంటేనే టాలీవుడ్ ప్రేక్షకులకు ఒక పండుగలాంటి ఫీలింగ్. ఎన్నో ఏళ్ల నిరీక్షణ తర్వాత వీరి కలయికలో తెరకెక్కుతున్న క్రేజీ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘ఆదర్శ కుటుంబం – హౌస్ నెం.47’ (Aadarsha Kutumbam – House No. 47). అయితే ఈ సినిమా కోసం కళ్లల్లో వత్తులు వేసుకుని ఎదురుచూస్తున్న అభిమానులకు మేకర్స్ ఊహించని షాక్ ఇచ్చారు. ముందుగా ప్రకటించిన ప్రకారం ఈ సినిమాను అక్టోబర్ 9న విడుదల చేయాల్సి ఉండగా.. విడుదలను వాయిదా వేస్తున్నట్లు మూవీ టీమ్ అధికారికంగా ప్రకటించింది.

ఈ విషయాన్ని స్వయంగా నిర్మాత సూర్యదేవర నాగవంశీ ప్రెస్‌మీట్ ఏర్పాటు చేసి వెల్లడించారు. సినిమా ఆలస్యం కావడానికి గల అసలు కారణాలను ఆయన మీడియాకు వివరంగా వెల్లడించారు.

ట్రైలర్ లేకుండా సినిమా విడుదల చేయలేం.. ప్రెస్‌‌మీట్‌లో నిర్మాత నాగవంశీ క్లారిటీ

సినిమా వాయిదాపై నిర్మాత నాగవంశీ మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

ఇంకా 2 సెట్ సాంగ్స్ షూటింగ్ బాకీ

“సినిమాలో ఇంకా రెండు భారీ సెట్ సాంగ్స్ షూటింగ్ పెండింగ్‌లో ఉంది. వెంకటేష్ గారు రీసెంట్‌గా డేట్స్ కేటాయించి ప్యాచ్‌వర్క్, ఒక సాంగ్ పూర్తి చేసినప్పటికీ.. మిగిలిన రెండు పాటల చిత్రీకరణ పూర్తి చేయడానికి మరికొంత సమయం పడుతుంది అని చెప్పారు.

ట్రైలర్ కట్ & పబ్లిసిటీకి సమయం లేదు

అక్టోబర్ 9కి విడుదల చేయాలంటే సరైన ప్రమోషన్లకు అస్సలు టైమ్ లేదు. ఒకవేళ బలవంతంగా అక్టోబర్ 9కి రిలీజ్ చేయాలనుకుంటే.. కనీసం థియేట్రికల్ ట్రైలర్ కూడా రిలీజ్ చేయకుండానే సినిమాను థియేటర్లలోకి తీసుకురావాల్సి వస్తుంది. ఒక క్రేజీ కాంబో మూవీని ట్రైలర్ లేకుండా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం ఏమాత్రం కరెక్ట్ కాదు అని తెలిపారు.

లేటైనా పర్లేదు.. క్వాలిటీ ముఖ్యం 

అందుకే సినిమా కొంచెం లేట్ అయినా పర్లేదు కానీ.. ముందుగా షూటింగ్ మొత్తం పూర్తి చేసుకుని, పక్కాగా థియేట్రికల్ కట్ చేతిలోకి వచ్చాకే కొత్త రిలీజ్ డేట్‌ను ప్రకటిస్తాం. మంచి ప్రమోషన్స్ ప్లాన్ చేసి గ్రాండ్‌గా థియేటర్లలోకి తెస్తాం” అని నాగవంశీ స్పష్టం చేశారు.

పోస్ట్ ప్రొడక్షన్, ప్రమోషన్ల జాప్యం:

సినిమాకు ప్రాణం పోసే నేపథ్య సంగీతం (RR) కోసం సంగీత దర్శకుడు ఎస్.ఎస్. థమన్ మరికొంత సమయం కావాలని దర్శకుడిని కోరారు. రష్‌లో తూతూమంత్రంగా ఇవ్వడం కంటే ఫ్యామిలీ ఎమోషన్స్ బాగా పండాలని ఆయన సమయం తీసుకుంటున్నారు.

ఇప్పటివరకు ఈ సినిమా నుంచి వచ్చిన ఒక టీజర్, ఒక సింగిల్‌కు మాత్రమే పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. మిగిలిన పాటలు ఇంకా విడుదల కాలేదు, సరైన రీతిలో గ్రౌండ్ ప్రమోషన్లు కూడా మొదలుపెట్టలేదు. ఇలాంటి హడావిడి పరిస్థితుల్లో విడుదల చేయడం సినిమా రిజల్ట్‌పై ప్రభావం చూపుతుందని మూవీ టీమ్ భావించింది.

తదుపరి విడుదల ఎప్పుడు?..

హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాని అక్టోబర్ 30న ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు ప్లాన్ చేస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో గట్టి ప్రచారం జరుగుతోంది.

త్వరలోనే మిగిలిన రెండు పాటల చిత్రీకరణ, పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేసి.. అదిరిపోయే థియేట్రికల్ ట్రైలర్‌తో పాటు కొత్త విడుదల తేదీపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశముంది. వెంకీ-త్రివిక్రమ్ జోడీ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయమని అభిమానులు ఆశిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *