AAA-MAHAA MAX Reels Contest: సినిమా.. అది మూడు గంటలైనా మూడు నిమిషాలైనా ప్రేక్షకులపై చూపించే ఇంపాక్ట్ ఒకేలా ఉంటుంది. తీసుకున్న కథను అందంగా చెప్పగలిగితే సినిమా నిడివితో పని ఉండదు. ఇది చాలాసార్లు రుజువైంది. నిడివి ఎక్కువగా ఉండే ఫీచర్ ఫిలిమ్స్ తీయడం కంటే.. తక్కువ నిడివితో అద్భుతాన్ని సృష్టించడం చాలా కష్టం. చెప్పే విషయాన్ని సూటిగా సుత్తిలేకుండా చెప్పగలగాలి. అది ఆకట్టుకునే అంశం అయి ఉండాలి. కచ్చితంగా పంచ్ ఉండాలి. ఇన్నిటినీ కలగలిపి షార్ట్ ఫిలిం తీయాలంటే చాలా ప్రతిభ ఉండాలి. అయితే, మనదగ్గర ప్రతిభకు కొదువ లేదు. కానీ, దానికి గుర్తింపు దొరకడం.. ప్రోత్సాహం దక్కడం కష్టం. అయితే, మంచి షార్ట్ ఫిలిం తీయగలిగే సత్తా ఉండి.. మిమ్మల్ని మీరు నిరూపించుకోగలమనే నమ్మకం మీకుండే మీకోసం అద్భుత అవకాశం వచ్చింది. అంతేకాదు.. మీరు కనుక విజేతగా నిలిస్తే లక్షల రూపాయాల జాక్ పాట్ ప్రైజ్ కూడా కొట్టేయవచ్చు.
AAA-MAHAA MAX Reels Contest: అవును ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ – AAA – MAHAA MAX ప్రపంచవ్యాప్త షార్ట్ ఫిలిమ్స్ పోటీని నిర్వహిస్తున్నాయి. AAA – MAHAA MAX మొదటి మహాసభలు నిర్వహించనున్న సందర్భంగా వివిధ అంశాలలో పోటీలను నిర్వహిస్తూ వస్తోంది. ఈ క్రమంలో షార్ట్ ఫిలిమ్స్ లో కూడా ప్రత్యేకంగా పోటీలను ఏర్పాటు చేసిందని AAA ఫౌండర్ హరి మోటుపల్లి వెల్లడించారు. ఇప్పటికే షార్ట్ ఫిలిమ్స్ పోటీకి అనూహ్య స్పందన వచ్చిందని.. పోటీలో పాల్గొనడానికి చాలామంది రిజిస్టర్ చేసుకున్నారని ఆయన వివరించారు. ఈ పోటీల్లో పాల్గొనడానికి జనవరి 31 చివరి తేదీ అని హరి మోటుపల్లి చెప్పారు.
AAA-MAHAA MAX Reels Contest: మంచి సామాజిక స్పృహ ఉన్న షార్ట్ ఫిలిమ్స్ తీసే సత్తా ఉన్నవారు.. తమ టాలెంట్ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాలని అనుకునే వారు ఈ పోటీల్లో పాల్గొనాలని AAA నేషనల్ ప్రెసిడెంట్ బాలాజీ వీర్నాల చెప్పారు. షార్ట్ ఫిల్మ్ పోటీల్లో పాల్గొనాలనుకునే వారు https://nationalconvention1.theaaa.org/reg/shortfilmcontest.html లింక్ క్లిక్ చేసి తమ ఎంట్రీలను పంపించవచ్చని ఆయన తెలిపారు. షార్ట్ ఫిల్మ్ ఏ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని చేసినా ఫర్వాలేదు కానీ, ఆకట్టుకునేలా ఉండాలని అన్నారు. ఎటువంటి అసభ్యత, అశ్లీలతకు తావు లేకుండా షార్ట్ ఫిలిమ్స్ రూపొందించాలని బాలాజీ సూచించారు.
AAA-MAHAA MAX Reels Contest: ఇక షార్ట్ ఫిలిమ్స్ పోటీలకు ఇచ్చే ప్రైజ్ వివరాలను AAA నేషనల్ ప్రెసిడెంట్ ఎలక్ట్ హరిబాబు తూబాటి వెల్లడించారు. షార్ట్ ఫిలిమ్స్ పోటీల్లో విజేతకు 15 లక్షల రూపాయల బహుమతి అందిస్తారు. అదేవిధంగా రన్నరప్ కు 10 లక్షల రూపాయలు ఇస్తారు. ఇవేకాకుండా పోటీలో పాల్గొన్న వారిలో 100 మంది ప్రతిభావంతులకు ప్రత్యేకంగా రూ.10 వేల రూపాయలతో పాటుగా.. AAA ట్రోఫీ, AAA సర్టిఫికెట్ ఇవ్వనున్నట్టు తెలిపారు. ప్రపంచస్థాయిలో ఇలా షార్ట్ ఫిలిమ్స్ పోటీలను నిర్వహించడం ఇదే మొదటిసారని హరిబాబు చెప్పారు. భారీ ప్రైజ్ మనీ సొంతం చేసుకునే అవకాశం ఉన్నందున టాలెంట్ నిరూపించుకోవడంతో పాటు ఆర్థికంగా లబ్ది పొందే అవకాశాన్ని AAA కల్పిస్తోందన్నారు.
అదండీ విషయం.. షార్ట్ ఫిలిమ్స్ చేయడంలో ఆసక్తి ఉండి.. ప్రోత్సాహం లేక వెనకడుగు వేస్తున్న వారికి ఇదొక అద్భుత అవకాశం. ఇప్పటికే షార్ట్ ఫిలిమ్స్ చేసి వాటిని ప్రమోట్ చేసుకోవడంలో ఇబ్బందులు పడేవారికి కూడా ఇది మంచి అవకాశం అని చెప్పవచ్చు. AAA – MAHAA MAX అందిస్తున్న ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవడం ద్వారా డబ్బు సంపాదించండి. మీ టాలెంట్ ను ప్రపంచానికి పరిచయం చేయండి. ఇంకెందుకు ఆలస్యం.. మీ సృజనాత్మకతకు మెరుగులు దిద్దండి. వెంటనే లాగిన్ అయి పోటీలకు రిజిస్టర్ చేసుకోండి.. మీ షార్ట్ ఫిలిమ్స్ అప్ లోడ్ చేసేయండి. ప్రైజ్ మనీ పట్టేయండి!