Balakrishna

Balakrishna: యూట్యూబ్ లో నందమూరి హీరోల రికార్డుల సునామీ!

Balakrishna: నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా రూపొందుతోన్న ‘అఖండ 2’ చిత్రం అంచనాలను ఆకాశానికి తాకించింది. బాలయ్య పుట్టినరోజు సందర్భంగా విడుదలైన టీజర్ ఒక్కసారిగా సోషల్ మీడియాను షేక్ చేసింది. యూట్యూబ్‌లో టాప్ ట్రెండింగ్‌లో నిలిచిన ఈ టీజర్, 140 గంటలకు పైగా ట్రెండ్ అవుతూ టాలీవుడ్‌లో సరికొత్త రికార్డు సృష్టించింది. గతంలో ‘పుష్ప 2’ టీజర్ 138 గంటలు టాప్‌లో ఉండగా, దాన్ని అఖండ 2 అధిగమించింది.

టాలీవుడ్ టాప్ 5 ట్రెండింగ్ టీజర్‌లలో నందమూరి హీరోలదే ఆధిపత్యం! మొదటి స్థానంలో ‘అఖండ 2’ ఉంటే, మూడు, నాలుగు స్థానాల్లో ఎన్టీఆర్‌కు చెందిన ‘జై లవకుశ’, ‘జనతా గ్యారేజ్’ టీజర్‌లు నిలిచాయి. బాబాయ్-అబ్బాయ్ జోడీ ఇలా రికార్డులను బద్దలు కొడుతూ దూసుకెళ్తోంది. అఖండ 2తో బాలయ్య మరోసారి బాక్సాఫీస్‌ను కుదిపేయనున్నారని ఫ్యాన్స్ ధీమాగా ఉన్నారు!

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *