Tere Ishq Mein: కోలీవుడ్ నుంచి బాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన ధనుష్ మరోసారి బ్లాక్‌బస్టర్ అందించాడు. ఈ ఏడాది విడుదలైన ‘తేరే ఇష్క్ మే’ సినిమా ప్రపంచవ్యాప్తంగా 118 కోట్లు వసూలు చేసింది. ఈ విషయం గురించి పూర్తి వివరాలు చూద్దాం.
Also Read: Sasirekha: కలర్‌ఫుల్‌గా “శశిరేఖ”.. చిరు మూవీ సెకండ్ సాంగ్ ప్రోమో రిలీజ్
వివిధ భాషల్లో నటిస్తూ అందరి మెప్పు పొందుతున్న ధనుష్ ఈ ఏడాది మూడు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. తెలుగులో ‘కుబేర’ 100 కోట్లు దాటగా, తమిళంలో ‘ఇడ్లీ కడై’ యావరేజ్ హిట్ గా నిలిచి 100 కోట్లు లోపే ఆగిపోయింది. అయితే హిందీలో వచ్చిన ‘తేరే ఇష్క్ మే’ బాక్సాఫీసు దగ్గర ధమాకా చేసింది. బోల్డ్ ఓపెనింగ్స్‌తో ప్రారంభమైన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 118 కోట్ల పైగా గ్రాస్ సాధించినట్టు నిర్మాతలు ధృవీకరించారు. మరో ఇండస్ట్రీ హీరోకు బాలీవుడ్‌లో 100 కోట్ల క్లబ్ సాధించడం అరుదైన ఘనత అయితే, ధనుష్ ఇది రెండోసారి సాధించడం విశేషం. గతంలో 2013లో వచ్చిన ‘రాంజానా’ కూడా 100 కోట్లు దాటిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్రం ఫైనల్ రన్‌లో 200 కోట్ల మార్క్‌ను అందుకునే అవకాశం ఉన్నట్టు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

