PM Modi: గోవాలోని ఆర్పోరా గ్రామంలోని ప్రముఖ ‘బిర్చ్ బై రోమియో లేన్’ నైట్‌క్లబ్‌లో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సిలిండర్ పేలుడు కారణంగా సంభవించిన ఈ దుర్ఘటనలో 23 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. మృతులందరూ ఆ క్లబ్‌కు చెందిన సిబ్బందిగా గుర్తించారు.
ఈ నేపథ్యంలో, మృతుల కుటుంబాలకు ప్రధాని మోదీ రూ.2 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా (పరిహారం) ప్రకటించారు. అలాగే, ఈ ఘటనలో గాయపడిన క్షతగాత్రులకు రూ.50 వేల చొప్పున పరిహారం అందిస్తామని తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందేలా చూడాలని కూడా ఆయన ఆదేశాలు జారీ చేశారు. ప్రధాని మోదీ తన ప్రకటనలో, ఈ విషాదంలో ప్రియమైన వారిని కోల్పోయిన కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
Also Read: Ashasvi Jaiswal: యశస్వి జైస్వాల్ అరుదైన ఘనత: మూడు ఫార్మాట్లలో సెంచరీలు చేసి
భద్రతా నిబంధనలు పాటించని క్లబ్‌పై దర్యాప్తు
మరోవైపు, గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ ప్రమాద ఘటనా స్థలాన్ని స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ‘బిర్చ్ నైట్ క్లబ్’ యాజమాన్యం భద్రతా నిబంధనలు పాటించకపోవడం వల్లే ఈ ఘోరం జరిగిందని అన్నారు. ఈ అగ్ని ప్రమాదంపై వివరణాత్మక దర్యాప్తు జరుపుతామని, నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ హెచ్చరించారు.

