Gold Price Today

Gold Price Today: షాక్ ఇస్తున్న పసిడి రేట్లు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే!

Gold Price Today: బంగారం ధరలు మళ్లీ పెరుగుతుండటంతో వినియోగదారులకు షాక్ తగిలింది. ఇటీవల కాలంలో ఏకంగా లక్షా 30 వేల మార్కును దాటిన గోల్డ్ రేట్లు… కొద్దిగా తగ్గినట్లే తగ్గి, ఇప్పుడు మళ్లీ పెరుగుతూ రికార్డు స్థాయికి చేరుకుంటున్నాయి. ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరలు పెరగడం వల్లే మన దేశంలో కూడా ధరలు పెరుగుతున్నాయని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో జరిగే మార్పుల ఆధారంగానే బంగారం, వెండి ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు వస్తుంటాయి.

నేడు ఎంత పెరిగాయి?
డిసెంబర్ 6, 2025 (శనివారం) ఉదయం 6 గంటల వరకు నమోదైన ధరల ప్రకారం…

* 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర నిన్నటితో పోలిస్తే రూ. 10 పెరిగి, రూ. 1,29,940 గా ఉంది.

* 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర కూడా రూ. 10 పెరిగి, రూ. 1,19,110 గా నమోదైంది.

* అయితే, వెండి ధర మాత్రం కాస్త తగ్గింది. కిలో వెండి ధర రూ. 100 తగ్గి, రూ. 1,86,900 లుగా ఉంది.

ప్రధాన నగరాల్లో నేటి ధరలు
తెలుగు రాష్ట్రాల్లో నేడు బంగారం ధరలు ఇలా ఉన్నాయి:
* హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నంలలో: 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ. 1,29,940, 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ. 1,19,110 గా ఉంది. ఈ మూడు నగరాల్లో కిలో వెండి ధర రూ. 1,95,900 లుగా ఉంది.

దేశంలోని ఇతర ప్రధాన నగరాల్లో ధరల వివరాలు:
* ఢిల్లీలో: 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1,30,090, 22 క్యారెట్ల ధర రూ. 1,19,260.

* ముంబై, బెంగళూరులో: 24 క్యారెట్ల ధర రూ. 1,29,940, 22 క్యారెట్ల ధర రూ. 1,19,110.

* చెన్నైలో: 24 క్యారెట్ల ధర రూ. 1,30,090, 22 క్యారెట్ల ధర రూ. 1,19,990 ఉంది.

ముఖ్య గమనిక: అన్ని నగరాల్లో బంగారం, వెండి ధరలు ఒకేలా ఉండవు. స్థానిక డిమాండ్, సరఫరా, రాష్ట్ర పన్నులు వంటి అంశాల కారణంగా ధరలు మారుతుంటాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *