Gujarat: బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పాల్గొన్న ఓ సభలో అపశృతి చోటుచేసుకున్నది. గుజరాత్ రాష్ట్రంలోని వడోదరలో జేపీ నడ్డా పాల్గొన్న సభలో ప్రసంగిస్తుండగా, ఆయన సెక్యూరిటీ విభాగంలో ఉన్న ఓ గార్డు వేదిక ముందే కుప్పకూలి పడిపోయారు. ఇదే సమయంలో జేపీ నడ్డా ప్రసంగిస్తూనే ఉన్నారు. వెంటనే ఇతర సిబ్బంది, సభా నిర్వాహకులు వచ్చి ఆయనను లేపి, మంచినీరు తాగించి సపర్యలు చేశారు. ఈ ఘటనపై వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే సెక్యూరిటీ గార్డు వేదిక ముందే కిందపడితే జేపీ నడ్డా ప్రసంగిస్తూనే ఉండటంపై నెటిజన్లు మాత్రం పెద్ద ఎత్తున విమర్శలు కురిపిస్తున్నారు.
