Faf du Plessis

Faf du Plessis: డుప్లెసిస్ సంచలన నిర్ణయం: ఐపీఎల్‌కు గుడ్‌బై

Faf du Plessis: దక్షిణాఫ్రికా స్టార్ క్రికెటర్ ఫాఫ్ డుప్లెసిస్ ఐపీఎల్ (IPL) అభిమానులకు షాకిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. 14 ఏళ్ల సుదీర్ఘ ఐపీఎల్ కెరీర్‌కు గుడ్‌బై చెబుతున్నట్లు ఆయన ప్రకటించారు. డిసెంబర్ 15న అబుదాబి వేదికగా జరగనున్న ఐపీఎల్ వేలంలో తాను పాల్గొనబోనని డుప్లెసిస్ స్పష్టం చేశారు. “14 ఏళ్లలో మొదటిసారి ఐపీఎల్‌కు దూరంగా ఉంటున్నాను, పాకిస్తాన్ సూపర్‌ లీగ్‌ తో నా కొత్త జర్నీ స్టార్ట్ చేయబోతున్నాను” అని ఆయన తెలిపారు. డుప్లెసిస్ 2012లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) తరఫున ఐపీఎల్‌లో అరంగేట్రం చేశారు.

ఇది కూడా చదవండి: Delhi Fire Accident: ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం.. మంటల్లో నలుగురు సజీవదహనం

2022 సీజన్ కోసం సీఎస్‌కే అతన్ని రిలీజ్ చేయగా, ఆ తర్వాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టులో చేరారు. 2022, 2023, 2024 సీజన్లలో ఆర్‌సీబీకి కెప్టెన్‌గా కూడా వ్యవహరించారు. చివరగా, 2025 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ప్రాతినిధ్యం వహించిన డుప్లెసిస్, ఈ నిర్ణయంతో ఐపీఎల్‌లో తన ప్రయాణాన్ని ముగించారు.

నాకు మద్దతుగా నిలబడిన ప్రతి కోచ్, సహచర ఆటగాళ్లు, సహాయక సిబ్బంది, అభిమానులకు ధన్యవాదాలు. 14 ఏళ్లు అంటే చాలా కాలం. నా జీవితంలో ఈ అధ్యాయాన్ని తలచుకుంటే గర్వంగా ఉంది. నా హృదయంలో భారత్‌కు ప్రత్యేక స్థానం ఉంది. ఇది కచ్చితంగా వీడ్కోలు కాదు. మనం మళ్లీ కలుస్తాం. ఈ సంవత్సరం, నేను ఒక కొత్త సవాలును స్వీకరించాలని నిర్ణయించుకున్నాను. రాబోయే PSL సీజన్‌లో ఆడబోతున్నాను’’ అంటూ తన భావోద్వేగపూరిత సందేశాన్ని డుప్లెసిస్‌ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *