Road Accident: కర్నూల్ జిల్లాలో ఘోర రోడ్డు చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 5 మంది మృతిచెందారు. శనివారం రోజు ఉదయం ఎమ్మిగనూరు పరిధిలోని కోటేకల్ గ్రామంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు చిన్నారులతో సహా ఐదుగురు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు.
వివరాల్లోకి వెళ్తే..
కర్ణాటక రాష్ట్రంలో కోలార్ కి చెందిన కొంత మంది మంత్రాలయంలోని రాఘవేంద్రస్వామి ఆలయాన్ని దర్శించుకోవడానికి వెళ్తుండగా కోటేకల్ వద్ద వేగంగా వస్తున్న మరో కారు ని వీరి ప్రయాణిస్తున్న కారును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: Malaika Arora: మలైకా అరోరా ఫిట్నెస్ సీక్రెట్ చెప్పేసింది.. ఉదయం లేవగానే
ఈ ప్రమాదంలో మొత్తం 5 మంది అక్కడికక్కడే మరణించగా మరో ఇద్దరికి గాయాలయ్యాయి. వీరిని సమీపంలోని హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. మరణించిన వారిని కోలార్ జిల్లాలోని చిన్న హోసపల్లికి చెందినవారిగా గుర్తించారు. ప్రమాదం గురించి సమాచారం తెలియడంతో ఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

