Panchayat Elections: రాష్ట్రంలో మూడు విడుతల్లో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు నవంబర్ 25న రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ మేరకు డిసెంబర్ 11, 14, 17వ తేదీల్లో పోలింగ్ నిర్వహణ ఉంటుందని ప్రకటించింది. ఈ మేరకు అదే రోజు నుంచి ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ వాతావరణం నెలకొన్నది.
Panchayat Elections: ఈ మేరకు ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం.. రేపటి నుంచి (నవంబర్ 28) కోలాహలం నెలకొంటుంది. తొలి విడుత నామినేషన్లు రేపటి నుంచే మొదలవుతాయి. నవంబర్ 29 వరకు నామినేషన్ల గడువు ఉంటుంది. అదే విధంగా రెండో విడత నవంబర్ 30 నుంచి డిసెంబర్ 2వ తేదీ నాటికి నామినేషన్ల స్వీకరణ గడువు ఉన్నది. అదే విధంగా డిసెంబర్ 3 నుంచి అదేనెల 5 వరకు ఆఖరి విడుత నామినేషన్ల స్వీకరణ గడువు ఉంటుంది.
Panchayat Elections: అదే విధంగా నామినేషన్ల నవంబర్ 30, డిసెంబర్ 3, 6 తేదీల్లో మూడు విడుతల నామినేషన్ల పరిశీలన ఉంటుంది. డిసెంబర్ 3, 6, 9వ తేదీల్లో నామినేషన్ల ఉపసంహరణకు ఎన్నికల సంఘం అవకాశం ఇచ్చింది. అదే తేదీల్లో ఆయా విడుతల వారీ అభ్యర్థుల తుదిజాబితాను ప్రకటిస్తుంది. పోలింగ్ తేదీల్లో ఉదయం 7 గంటలకే ప్రారంభమై మధ్యాహ్నం ఒంటిగంట వరకే ముగుస్తుంది. అదేరోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది.
