Minister Anagani

Minister Anagani: రైతుల సంతోషం చూసి జగన్ ఓర్వలేకపోతున్నారు: మంత్రి అనగాని

Minister Anagani: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై మంత్రి అనగాని సత్యప్రసాద్‌ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో రైతులు సంతోషంగా ఉండటం చూసి జగన్‌కు ఈర్ష్య, అసూయలు పెరిగిపోయాయని ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. గత వైఎస్సార్‌సీపీ పాలనలో రైతులకు ఆత్మహత్యలే శరణ్యమయ్యాయని మంత్రి ఆరోపించారు. జగన్ పాలనలో ప్రతి సంవత్సరం దాదాపు 700 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్న విషయాన్ని ఈ సందర్భంగా అనగాని ప్రస్తావించారు.

Also Read: Tirumala: తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త! పది రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం

ప్రస్తుత కూటమి ప్రభుత్వం ‘పంచసూత్రాల’ పేరుతో రైతులను బలోపేతం చేస్తుందని, తద్వారా రైతులు తమ ఉత్పత్తులతో ప్రపంచ మార్కెట్‌తో పోటీ పడే స్థాయికి చేరుకుంటారని మంత్రి వివరించారు. రైతుల బాగు చూడలేకపోయిన జగన్ ఇప్పుడు ప్రభుత్వం ప్రవేశపెట్టిన పంచసూత్రాల పథకంపై విమర్శలు చేస్తూ, ఏడుస్తున్నారని ఆయన మండిపడ్డారు. జగన్‌కు కుట్రలు, కుతంత్రాలతో పాటు, రైతుల సంతోషాన్ని చూడలేని ఈర్ష్య, అసూయలు కూడా పెరిగిపోయాయని మంత్రి అనగాని సత్యప్రసాద్‌ వ్యాఖ్యానించారు.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *