Ibomma: ఐ-బొమ్మ రవిని ఎన్కౌంటర్ చేయాలని ఒక నిర్మాత చేసిన వ్యాఖ్యలను రవి తండ్రి అప్పారావు తీవ్రంగా తప్పుబట్టారు. అలాంటి మాటలు ఎంత బాధ కలిగిస్తాయో, ఆ నిర్మాతను కానీ ఆయన కొడుకును కానీ ఎవరో చేస్తే తెలుస్తుందని ఆయన వ్యాఖ్యానించారు.
ఎన్కౌంటర్ చేయమని చెప్పే హక్కు సినిమా వాళ్లకు ఎవరు ఇచ్చారని అప్పారావు ప్రశ్నించారు. పోలీసులు ఇప్పటికే విచారణ చేస్తుండగా, సినీ పరిశ్రమ వ్యక్తులు ఎందుకు జడ్జిమెంట్లు ఇస్తున్నారని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు
వందల కోట్లు పెట్టి సినిమాలు తీసి, చివరికి ప్రజల మీదే భారం మోపే పరిస్థితిని సృష్టిస్తున్నారని కూడా ఆయన విమర్శించారు. తన కుమారుడు రవి పోలీసు కస్టడీలో ఉన్న సమయంలో రెండుసార్లు తనతో మాట్లాడినట్లు అప్పారావు తెలిపారు.
