Pakistan News: పాకిస్థాన్ దేశంలో జరిగిన ఓ భారీ అగ్నిప్రమాదంలో మృతుల సంఖ్య 16కు చేరింది. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తున్నది. ఆ దేశంలోని పంజాబ్ ప్రావిన్స్‌లోని ఫైసలాబాద్ గమ్ తయారీ కంపెనీలో జరిగిన భారీ పేలుడు ఘటనతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. దీంతో అప్పటికప్పుడే 15 మంది దుర్మరణం పాలయ్యారు. మరో ఏడుగురికి గాయాలయ్యాయి. వారిలో చికిత్స పొందుతూ మరొకరు చనిపోయారు.
Pakistan News: ఘటనా స్థలం లాహోర్ నుంచి 130 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ భారీ పేలుడు ఘటనతో పరిశ్రమ సమీపంలో ఉన్న పలు ఇళ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఘటన జరగగానే ఫ్యాక్టరీ యాజమాని పరారీలో ఉండగా, మేనేజర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రమాదానికి గల కారణాలను పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే సరైన భద్రతా చర్యలు చేపట్టిన కారణంగానే పేలుడు ఘటన జరిగిందని ప్రాథమిక విచారణలో తేల్చారు.
Pakistan News: ప్రత్యేక బృందాలు సహాయక చర్యలు చేపడుతున్నాయని, క్షతగాత్రులకు సమీప ఆసుపత్రుల్లో చికిత్సలు కొనసాగుతున్నాయని ఫైసలాబాద్ డిప్యూటీ కమిషనర్ రాజా జహంగీర్ అన్వర్ తెలిపారు. ఫైసలాబాద్ పేలుడు ఘటనపై పంజాబ్ ప్రావిన్స్ ముఖ్యమంత్రి మరియం నవాజ్ స్పందించారు. ఘటనపై ఆయన విచారం వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తంచేశారు.
