Akhanda 2: నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ అంటే అభిమానుల్లో ప్రత్యేక ఉత్సాహం ఉంటుందనే విషయం తెలిసిందే. ఈ హిట్ కాంబినేషన్ తీసుకువస్తున్న తాజా యాక్షన్ డ్రామా ‘అఖండ 2’ ట్రైలర్ విడుదలయ్యాక, ప్రేక్షకుల్లో ఉత్సాహం మరింత పెరిగింది. భారీ విలన్ షేడ్స్, పవర్ఫుల్ డైలాగ్స్, అఖండ పాత్ర రౌద్రరూపం, అని కలిసి ట్రైలర్‌ను హై వోల్టేజ్‌గా మార్చాయి.
భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఆది పినిశెట్టి ప్రధాన ప్రతినాయకుడిగా కనిపించనున్నాడు. ట్రైలర్ విడుదలైన వెంటనే సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచింది. మొదటి భాగం సాధించిన విజయంతో పోలిస్తే, ఈ సీక్వెల్‌ను మరింత శక్తివంతంగా చూపించాలన్న ఉద్దేశంతో బోయపాటి రూపొందించిన ఈ యాక్షన్ ప్యాక్డ్ ప్రెజెంటేషన్ అభిమానులను ఆకట్టుకుంది.
కర్ణాటకలోని చింతామణిలో ఏర్పాటు చేసిన గ్రాండ్ ఈవెంట్లో శివరాజ్‌కుమార్ ముఖ్య అతిథిగా హాజరై ట్రైలర్‌ను లాంచ్ చేయగా, ఆ తరువాత సోషల్ మీడియాలో అధికారికంగా రిలీజ్ చేశారు. 2 నిమిషాలు 41 సెకన్ల నిడివి గల ఈ వీడియో పూర్తిగా అఖండ రౌద్రం, ధర్మం, బాలయ్య మాస్ ఆరా చుట్టూనే నడిచింది.
ట్రైలర్ ప్రారంభం నుంచే గంభీరతను సెట్ చేస్తూ, “కష్టమొస్తే దేవుడొస్తాడు అని నమ్మే జనానికి…” అంటూ సాగిన డైలాగ్ సినిమాకు ఉండబోయే భావాన్ని చక్కగా వ్యక్తపరిచింది. కుంభమేళా నేపథ్యంలో విలన్ ఆది పినిశెట్టి ఎంట్రీ, “8 కంఠాలు తెగాలి…” అని చెప్పిన డైలాగ్ ఆయన పాత్ర దుష్టశక్తులను స్పష్టంగా చూపించింది.
Also Read: RGV: పైరసీ ఎప్పటికీ ఆగదు.. వర్మ సంచలన ట్వీ్ట్
మరోవైపు మురళీ కృష్ణ పాత్రలో బాలయ్య సాఫ్ట్ షేడ్స్‌లో కనిపిస్తూ కుటుంబ అనుబంధాలను చూపించిన తర్వాత, మంచు కొండల్లో సాగే సన్నివేశంతో కథలో రిథమ్ పెంచారు. వెంటనే అఖండ ఎంట్రీని ఘనంగా కట్ చేయడం ట్రైలర్‌కు ప్రధాన హైలైట్‌గా నిలిచింది. “ఈ ప్రపంచంలో ఏ దేశం వెళ్లినా కనిపించేది మతం… ఈ దేశంలో కనిపించేది ధర్మం…” అనే లైన్ బోయపాటి స్టైల్ ఎలివేషన్‌కు మరో ఉదాహరణగా నిలిచింది.
త్రిశూలంతో చేసిన భారీ యాక్షన్ స్ట్రైక్స్, థమన్ అందించిన బీజీఎం, రాంప్రసాద్–సంతోష్ దేట్కే సినిమాటోగ్రఫీ ట్రైలర్‌ను విజువల్‌గా మరింత శక్తివంతం చేశాయి. సంయుక్త మీనన్ హాజరుపరచిన గ్లామర్, హర్షాలీ మల్హోత్రా పాత్ర ఇంపాక్ట్ కూడా ట్రైలర్‌ను ప్రత్యేకంగా చూపించాయి. “ఇప్పటి వరకూ మా దేశ రూపాన్ని మాత్రమే చూసుంటావ్… మా దేశ విశ్వరూపాన్ని చూడలేదు” అనే డైలాగ్ విడుదలైన వెంటనే సోషల్ మీడియాలో వైరల్ అయింది. బాలయ్య ఫ్యాన్స్ ఈ ఒక్క లైన్‌తోనే సినిమా మరింత పటిష్టంగా ఉంటుందని కామెంట్లు చేస్తున్నారు.
డిసెంబర్ 5న వరల్డ్ వైడ్‌గా రిలీజ్ కానున్న ‘అఖండ 2’ కోసం అంచనాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. మొదటి భాగం రికార్డులు దృష్టిలో ఉంచుకుని, ఈసారి ఇంకెంత భారీగా బాలయ్య–బోయపాటి తెరపైన మాస్ సునామీ చూపిస్తారో అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
