iBOMMA

iBOMMA: పైరసీ కింగ్‌ ‘ఐ-బొమ్మ’ రవి అరెస్ట్.. స్పందించిన తండ్రి అప్పారావు ఏమన్నారంటే!

iBOMMA: టాలీవుడ్‌తో పాటు భారతీయ సినిమా పరిశ్రమను దీర్ఘకాలంగా వేధిస్తున్న పైరసీ వెబ్‌సైట్‌ ‘ఐ-బొమ్మ (I-Bomma)’ నిర్వాహకుడిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేయడం సంచలనం సృష్టించింది. కరీబియన్‌ దీవుల్లో ఉంటూ, ఏళ్ల తరబడి సినిమాలను పైరసీ చేస్తున్న విశాఖకు చెందిన ఇమ్మడి రవిని (I-Bomma Ravi) ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్ రాగానే కూకట్‌పల్లిలోని రెయిన్‌ విస్టా ఫ్లాట్‌లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ అరెస్ట్ నేపథ్యంలో, రవి తండ్రి అప్పారావు ఓ మీడియా కు ఇచ్చిన ఇంటర్యూ లో అయన ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

రవి అరెస్ట్‌పై ఆదివారం మీడియాతో మాట్లాడిన అప్పారావు, తన కుమారుడి గురించి కీలక విషయాలను వెల్లడించారు. నా కుమారుడు రవి సుమారు 15 ఏళ్ల క్రితం ఉద్యోగం చేస్తానని ఇంటి నుంచి హైదరాబాద్‌కు వెళ్లాడు. కొన్నాళ్ల తర్వాత సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం వచ్చిందని చెప్పాడు. రవితో మాట్లాడి దాదాపు రెండు నెలల పైనే అవుతుంది. రవిపై నమోదైన కేసుల గురించి నాకు ఎలాంటి సమాచారం తెలియదు. కుమారుడు పైరసీ వెబ్‌సైట్‌ను నడుపుతున్న విషయం గురించి తనకు ఏ మాత్రం అవగాహన లేదని ఆయన స్పష్టం చేశారు.

ఇది కూడా చదవండి: Cricket: ఓటమికి కారణం బ్యాటర్లే.. టీమ్ ఇండియా పై ఫైర్ అయిన గంభీర్

కుమారుడిపై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేసిన నేపథ్యంలో, అప్పారావు చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. సమాజానికి ఎవరు చెడు చేసినా చర్యలు తీసుకోవాల్సిందే అన్నారు. రవి విషయం హైదరాబాద్‌ పోలీసులు చూసుకుంటారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందని, తప్పు చేసిన వారికి శిక్ష తప్పదని ఆయన చెప్పకనే చెప్పడం గమనార్హం.

హార్డ్‌ డిస్క్‌లు, హెచ్‌డీ ప్రింట్‌లు స్వాధీనం

కరీబియన్‌ దీవుల నుంచి అంతర్జాతీయంగా పైరసీ నెట్‌వర్క్‌ను నడుపుతున్న రవి స్వస్థలం విశాఖపట్నంగా పోలీసుల విచారణలో తేలింది. కూకట్‌పల్లిలోని అతడి ఫ్లాట్‌లో సోదాలు నిర్వహించిన సైబర్ క్రైమ్ పోలీసులు..

హార్డ్‌ డిస్క్‌లు, కంప్యూటర్లు, కొన్ని సినిమాలకు సంబంధించిన హెచ్‌డీ ప్రింట్‌లు వంటి కీలక సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఐ-బొమ్మ వెబ్‌సైట్‌ సర్వర్‌ నుంచి వివరాలను సేకరించిన పోలీసులు, అప్‌లోడ్‌ చేయడానికి సిద్ధంగా ఉన్న మరికొన్ని సినిమాల కంటెంట్‌ను కూడా హోల్డ్‌లో ఉంచినట్లు సమాచారం.

ఒకవైపు పైరసీ కారణంగా నష్టపోతున్న సినీ పరిశ్రమ ఆనందం వ్యక్తం చేస్తుంటే, మరోవైపు తల్లిదండ్రులు తమ కుమారుడి అరెస్ట్ విషయంలో చూపించిన నిష్పక్షపాత వైఖరి అందరి దృష్టిని ఆకర్షించింది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *