Hyderabad

Hyderabad: అర్ధరాత్రి కారు బీభత్సం.. మద్యం మత్తులో యువతి

Hyderabad: హైదరాబాద్ లో ఓయువతి రెచ్చిపోయింది. అత్యంత రద్దీ ప్రాంతాల్లో ఒకటైన జూబ్లీహిల్స్‌లో శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఓ కారు భీభత్సం సృష్టించింది. మద్యం మత్తులో యువతి నడుపుతున్న కారు వేగంగా వచ్చి అదుపుతప్పి విద్యుత్ స్తంభాన్ని బలంగా ఢీకొని బోల్తా పడింది. కారు నడుపుతున్న యువతి మద్యం సేవించినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. అధిక వేగం, మద్యం మత్తు కారణంగా కారు అదుపు తప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొంది. మాద తీవ్రతకు కారు బోల్తా పడినప్పటికీ, కారులోని ఎయిర్ బ్యాగ్‌లు తెరుచుకోవడంతో ఆమెకు స్వల్ప గాయాలయ్యాయి. యువతి డ్రైవింగ్ సీటులో ఇరుక్కుపోవడంతో స్థానికులు కారు అద్దాలు పగలగొట్టి ఆమెను అతి కష్టం మీద బయటకు తీశారు.గాయపడిన యువతిని వెంటనే చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఫిల్మ్‌నగర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *