Rashid Khan

Rashid Khan: ఊహాగానాలకు చెక్ పెట్టిన స్టార్ స్పిన్నర్! రెండవ వివాహంపై క్లారిటీ!

Rashid Khan: క్రికెట్ ప్రపంచంలో తన మాయాజాలంతో అభిమానులను ఉర్రూతలూగించే ఆఫ్ఘనిస్తాన్ స్టార్ లెగ్-స్పిన్నర్ రషీద్ ఖాన్, ఈసారి ఆట కంటే తన వ్యక్తిగత జీవితంతో వార్తల్లో నిలిచారు. ఇటీవల ఒక మహిళతో కలిసి సాంప్రదాయ దుస్తులలో ఉన్న ఆయన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, రషీద్ రెండో వివాహం చేసుకున్నారనే ఊహాగానాలకు తెరలేచింది. ఈ విషయంపై నెట్టింట పెద్ద చర్చ నడుస్తుండగా, రషీద్ స్వయంగా స్పందించి పూర్తి క్లారిటీ ఇచ్చారు.

పుకార్లపై రషీద్ క్లారిటీ
తాను మళ్లీ పెళ్లి చేసుకున్నారనే వార్తలను రషీద్ ఖాన్ ధృవీకరించారు. ఆ వైరల్ ఫ్రేమ్‌లో ఉన్న మహిళ తన భార్య అని ఆయన స్పష్టం చేశారు. ఆగస్టు 2, 2025న తన రెండవ నిఖా (వివాహం) జరిగిందని, “ప్రేమ, శాంతి, నేను ఎప్పుడూ ఆశించిన భాగస్వామ్యాన్ని కలిగి ఉన్న ఒక మహిళను” వివాహం చేసుకున్నానని ఆయన ఇన్‌స్టాగ్రామ్‌ పోస్ట్‌లో రాసుకొచ్చారు.
2025 ఆగస్టు 2వ తేదీన నా జీవితంలో కొత్త అధ్యాయం మొదలైంది. నేను నా నిఖా చేసుకుని, నేను ఎప్పుడూ ఆశించిన ప్రేమ, శాంతి, భాగస్వామ్యాన్ని కలిగి ఉన్న ఒక మహిళను వివాహం చేసుకున్నాను. ఆ ఫొటోల్లో ఉన్నది నిజంగా నా భార్య, మేము దాచడానికి ఏమీ లేకుండా కలిసి నిలబడతాం,” అని రషీద్ పేర్కొన్నారు.

Also Read: IPL 2026 Mini Auction: ఐపీఎల్‌ ఫ్రాంచైజీలు కీలక నిర్ణయం.. స్టార్‌ ప్లేయర్లను వదులుకోవడానికి సిద్ధం.. వరెవరో తెలుసా?

ఛారిటీ ఈవెంట్‌తో మొదలైన చర్చ
రషీద్ ఖాన్ ఇటీవల నెదర్లాండ్స్‌లో తన ‘ఖాన్ ఛారిటీ ఫౌండేషన్’ ప్రారంభోత్సవానికి తన భార్యతో కలిసి హాజరయ్యారు. ఈ ఛారిటీ ఫౌండేషన్ ఆఫ్ఘన్ కమ్యూనిటీల కోసం విద్య, ఆరోగ్య సంరక్షణ, శుభ్రమైన నీటిపై పనిచేస్తుంది. ఈ ఛారిటీ కార్యక్రమ సమయంలో తీసిన ఫోటోలే సోషల్ మీడియాలో ‘మిస్టరీ గర్ల్’ పేరుతో వైరల్ అయ్యాయి. ముఖ్యంగా, తన భార్య హిజాబ్ లేకుండా కనిపించడం ఇదే మొదటిసారి కావడంతో, అభిమానులు ఆమెను గుర్తించలేకపోయి, పుకార్లకు దారి తీశారని తెలుస్తోంది. కాగా, రషీద్ ఖాన్ మొదటి వివాహం అక్టోబర్ 2024లో కాబూల్‌లో జరిగింది. అదే సమయంలో ఆయన సోదరులు కూడా వివాహం చేసుకున్నారు.

వ్యక్తిగత జీవితం పక్కన పెడితే, రషీద్ ఖాన్ టీ20 క్రికెట్‌లో ఒక దిగ్గజ బౌలర్‌గా కొనసాగుతున్నారు. ఆయన ఇప్పటివరకు ఆడిన 108 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లలో 13.69 సగటుతో 182 వికెట్లు తీసి, టీ20ఐలలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా రికార్డు సృష్టించారు. ఇటీవల ఆయన ఆసియా కప్‌లో ఆఫ్ఘనిస్తాన్ జట్టుకు నాయకత్వం వహించినప్పటికీ, వారి జట్టు సెమీ-ఫైనల్‌కు అర్హత సాధించడంలో విఫలమైంది.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *