Dharmendra Death

Dharmendra Death: మా నాన్న ఇంకా చనిపోలేదు..ఈషా దేవోల్‌

Dharmendra Death: బాలీవుడ్ దిగ్గజ నటుడు ధర్మేంద్ర (89) ఆరోగ్యంపై సోషల్ మీడియాలో వచ్చిన మరణ వార్తలకు ఆయన కుటుంబ సభ్యులు గట్టిగా బదులిచ్చారు. శ్వాస సమస్యల కారణంగా ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చేరిన ఆయన పరిస్థితి నిలకడగా ఉందని, వేగంగా కోలుకుంటున్నారని ఆయన కుమార్తె ఇషా డియోల్ స్పష్టం చేశారు.

రాజ్‌నాథ్ సింగ్ ట్వీట్‌తో పుకార్ల అలజడి

మంగళవారం ఉదయం రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చేసిన ట్వీట్ కారణంగానే ఈ పుకార్లు సోషల్ మీడియాలో మరింత వ్యాప్తి చెందాయి. రాజ్‌నాథ్ సింగ్ తన ట్వీట్‌లో, “ప్రముఖ నటుడు, మాజీ ఎంపీ శ్రీ ధర్మేంద్ర జీ మరణం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. భారతీయ సినిమాకు ఆయన చేసిన అద్భుతమైన కృషి ఎల్లప్పుడూ గుర్తుండిపోతుంది. ఆయన కుటుంబానికి మరియు అభిమానులకు నా హృదయపూర్వక సంతాపం” అని పేర్కొన్నారు. అయితే, ఆయన ట్వీట్ చేసిన కొద్దిసేపటికే అది కేవలం పుకార్లేనని తేలింది.

Rajnath

కుటుంబ సభ్యుల ఖండన

ధర్మేంద్ర కుమార్తె ఇషా డియోల్ ఈ మరణ వార్తలన్నీ అబద్ధమని, నటుడు స్థిరంగా ఉన్నారని ధృవీకరించారు. మీడియా ఇంకా సోషల్ మీడియాలో మా నాన్న చనిపోయారు అంటూ తప్పుడు వార్తలను వ్యాప్తి చేస్తున్నారు. నాన్నగారు స్థిరంగా ఉన్నారు, కోలుకుంటున్నారు అని ఈషా దేవోల్‌ అన్నారు. నాన్నగారు త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేసినందుకు అందరికి ధన్యవాదాలు తెలిపారు.

ఇది కూడా చదవండి: Jubilee Hills By Poll: ఓటేసిన మాగంటి సునీత.. మొరాయిస్తున్న ఈవీఎంలు

సోమవారం సాయంత్రం, కుమారుడు సన్నీ డియోల్ బృందం కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసింది. శ్రీ ధర్మేంద్ర స్థిరంగా  ఉన్నారు దయచేసి ఆయన ఆరోగ్యం గురించి తప్పుడు పుకార్లను వ్యాప్తి చేయవద్దు. ఆయన త్వరగా కోలుకోవాలని ఇంకా మీడియా వాళ్ళు కుటుంబ సభ్యులకి కొంత  గోప్యత ఇవ్వాలి అన్ని అన్నారు.

Dharmendra death

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *