Roja

Roja: సడన్‌గా రోజా అదృశ్యమవడం వెనుక కారణమేంటి?

Roja: ఆడుదాం ఆంధ్రా అవినీతి రిపోర్టు ప్రభుత్వ టేబుల్ మీద రెండు నెలలుగా దుమ్ము పట్టి పోతోంది. కానీ రోజా? చక్కగా తమిళనాడులో సినిమాలు, షోలు చేసుకుంటూ పొలిటికల్‌ డిస్టెన్స్‌ పాటిస్తున్నారు. వైసీపీలో ఇదో వింత రోగం కాబోలు. జగన్‌ ఆల్వేస్‌ యళహంక ప్యాలెస్‌లో థిలాసాగా గడుపుతుంటారు. వరదలు, తుపాన్‌లు వచ్చి రైతుల కష్టం కొట్టుకుపోతున్నా రాష్ట్రానికి రారు. కానీ చంద్రబాబు పెట్టుబడుల కోసం లండన్‌లో పర్యటించొద్దంటారు, విమెన్‌ క్రికెటర్స్‌ ఎంకరేజ్‌మెంట్ కోసం లోకేష్‌ ముంబై వెళ్లి వరల్డ్‌ కప్‌ ఫైనల్ చూడొద్దంటారు. సేమ్‌ అలాగే.. రోజా జబర్దస్త్‌ షోలు చేస్తుంటారు, పక్క రాష్ట్రాల్లో షూటింగులు చేసుకుంటూ ఉంటారు. కానీ పవన్‌ కళ్యాణ్‌వి పార్ట్‌మైన్‌ పాలిటిక్స్‌ అంటూ విమర్శిస్తుంటారు. మొన్నామధ్య అయితే.. మీకు డిప్యూటీ సీఎం పదవి ఎందుకు, వెళ్లి షూటింగులు చేసుకోమంటూ విరుచుకుపడ్డారు. అయితే ఇటీవల యాంకర్‌ శ్యామలకి వైసీపీ అధికారిక స్పోక్స్ పర్సన్‌గా జగనన్న పిలిచి పదవి ఇచ్చిన తర్వాత… రోజాకు నోటికి పనిచెప్పాల్సిన అవసరం పెద్దగా లేకుండా పోయింది. వైసీపీలో ఎవరు పడితే వారు మాట్లాడేందుకు ఉండదు. తమ సొంత అభిప్రాయాలన్నట్లుగా ఏది పడితే అది మాట్లాడితే కుదరదు. స్క్రిప్టు సహా పొలిటికల్‌ కాల్‌షీట్లన్నీ సజ్జల వంటి పెద్దలు చూస్తూ ఉంటారు. రోజా నోటికి పదును తగ్గకపోయినా.. ఆమె ప్రెస్మీట్లకి జనాల్లో రేటింగ్‌ పడిపోవడంతో.. తెరపైకి శ్యామలని తీసుకొచ్చారు. శ్యామల స్క్రిప్టులో ఉన్న సబ్జెక్టుని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి బదులు, తన యాక్టింగ్‌ స్కిల్స్‌తోనే జనాల్ని ఎంటర్‌టైన్‌ చేస్తున్నారు. అంతేకాదు.. వైసీపీ లీడర్లను అందర్నీ వెనక్కు నెట్టేసి అతి తక్కువ కాలంలోనే బిగ్గెస్ట్‌ ట్రోల్‌ మెటీరియల్‌గా మారిపోయారు శ్యామల. ఈ నేపథ్యంలోనే రోజాకి పెద్దగా పనిలేకుండా పోయింది.

Also Read: Revanth Reddy: కేటీఆర్ ని అరెస్ట్ చేయాలి అనుకున్నాం.. కానీ గవర్నర్ అనుమతి ఇవ్వలేదు..!

విజిలెన్స్ నివేదికలో రోజా పేరు మీద భారీ అవినీతి ఆరోపణలు ఉన్నాయి. దీంతో అరెస్ట్‌ కోసం ఆమె ఎదురుచూసినా, కూటమి ప్రభుత్వం మాత్రం ఆ పని చేయట్లేదు. ఆ దిశగా సంకేతాలు కూడా ఏమీ కనబడకపోవడంతో మళ్లీ యాక్టింగ్‌పై దృష్టి పెట్టినట్లున్నారు రోజా. తాజాగా లెనిన్ పాండియన్ సినిమాలో వృద్ధురాలి గెటప్‌లో రీఎంట్రీ ఇస్తున్నారట రోజా. 90ల గ్లామర్ హీరోయిన్ 12 ఏళ్ల తర్వాత సిల్వర్ స్క్రీన్‌కు తిరిగి వస్తుండటంతో పలువురు తమిళ నటులు ఆమెకు శుభాకాంక్షలు పంపారు.

వైసీపీలో ఫైర్‌బ్రాండ్ ముద్ర ఉన్నా.. తాడేపల్లి కేంద్రంలో కనిపించడం మానేసింది రోజా. పార్టీ సీనియర్లు “రోజా ఉంటే మేం ఉండలేం” అని బహిరంగంగా చెప్పినట్టు ప్రచారం జరుగుతోంది. ఫలితంగా శ్యామలకు ప్రెస్ మీట్ల బాధ్యతలు ఇచ్చి, రోజాను సైడ్‌లైన్ చేశారని సమాచారం. మరోవైపు టాలీవుడ్‌లో కూడా రోజాను దూరంగా పెట్టారని విశ్లేషకులు అంటున్నారు. ఇప్పటికే జబర్దస్త్‌లో జడ్జి పదవి వదులుకున్నారు రోజా. ఇక ఏపీలో తనకు ఏవిధమైన అవకాశాలు లేవని భావించే ఆమె తమిళ సినిమాల్లో బిజీ అయిపోయారని టాక్‌ నడుస్తోంది. రాజకీయాలకు గుడ్‌బై చెప్పే దిశగా అడుగులు వేస్తున్నారని కూడా కొందరు అంటున్నారు. అది ఎంత మాత్రం నిజమో ఇప్పుడే చెప్పలేము. ఎందుకంటే వైసీపీలోనూ ప్రస్తుతం ఆమెకు పెద్దగా స్థానం లేదు. పార్టీ ఓటమికి రోజా ప్రధాన కారణమని కొందరు నిందిస్తున్నారు. మరో పార్టీలో ఆమెకు చోటివ్వడానికి అందరూ భయపడుతున్నారు. ఈ నేపథ్యంలో లెనిన్ పాండియన్ సక్సెస్ అయితే తమిళంలో మరిన్ని అవకాశాలు వస్తాయని, అప్పుడు రాజకీయాలు పూర్తిగా వదిలేయొచ్చని రోజా ఒక నిర్ణయానికి వచ్చారంటూ ప్రచారం జరుగుతోంది. అయితే వచ్చే ఎన్నికల నాటికి వైసీపీ పరిస్థితి కొద్దో గొప్పో మెరుగైతే రోజా మళ్లీ ఎంట్రీ ఇచ్చే అవకాశాలు లేకపోలేదు. ఇప్పటికైతే అరవ ప్రేక్షకుల్ని మెప్పించడమే రోజా ముందున్న టాస్క్‌ అని తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *