Gouri G. Kishan

Gouri G. Kishan: యూట్యూబర్ జర్నలిస్ట్ ఓవరాక్షన్.. హీరోయిన్ కు క్షమాపణలు!

Gouri G. Kishan: నటి గౌరీ కిషన్‌ను ఆమె బరువు గురించి అభ్యంతరకరమైన ప్రశ్న అడిగి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న యూట్యూబర్- జర్నలిస్ట్ ఆర్.ఎస్. కార్తీక్ ఎట్టకేలకు క్షమాపణలు చెప్పాడు. అయితే, తన ప్రశ్న ఉద్దేశం వేరే విధంగా ఉందని, అది సరదాగా అడిగిందే తప్ప, బాడీ షేమింగ్ చేసేందుకు కాదని ఆయన వివరణ ఇవ్వడం గమనార్హం. గత కొన్ని రోజులుగా నేను చాలా మానసిక ఒత్తిడికి గురయ్యాను. నేను ఒక ఉద్దేశంతో ప్రశ్న అడిగాను, కానీ గౌరీ కిషన్ దానిని వేరే విధంగా అర్థం చేసుకున్నారు. ఈ ప్రశ్న వలన ఆమె మనసు బాధపడి ఉంటే, దానికి నేను క్షమాపణలు చెబుతున్నాను” అని కార్తీక్ పేర్కొన్నారు.

అయితే తన ప్రశ్నలో ఎలాంటి తప్పు లేదని వాదిస్తూ, సినిమాలో హీరో ఆమెను ఎత్తే సన్నివేశం గురించి సరదాగా అడగాలని మాత్రమే తాను భావించానని, ఎవరినీ ఉద్దేశపూర్వకంగా బాధపెట్టే ఆలోచన లేదని కార్తీక్ చెప్పారు. ఈ సంఘటన మీడియా వృత్తిపరమైన ప్రమాణాలపై పెద్ద చర్చకు దారితీసింది, చిత్ర పరిశ్రమ మొత్తం మీడియా జవాబుదారీతనం కోసం డిమాండ్ చేసింది.

కార్తీక్ క్షమాపణ చెప్పినా, ఈ సంఘటనపై చిత్ర పరిశ్రమ తీవ్రంగా స్పందించింది. దక్షిణ భారత నటీనటుల సంఘం అధ్యక్షుడు నాజర్, ఈ సంఘటనను తీవ్రంగా ఖండించారు. జర్నలిజం ముసుగులో ఇటువంటి అనైతిక చర్యలను తాము సహించబోమని, మహిళా నటీమణుల పట్ల గౌరవం తప్పనిసరి అని పేర్కొన్నారు. సినీ ప్రముఖులు, మీడియా వృత్తిపరమైన ప్రమాణాలను పాటించాలని, మహిళా నటీమణులను వారి నటన ఆధారంగా మాత్రమే అంచనా వేయాలని, వ్యక్తిగత విషయాలు, శరీరాకృతి గురించి అడిగే ధోరణి మారాలని గట్టిగా డిమాండ్ చేశారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *