Suicide:

Suicide: పోలీస్ స్టేష‌న్ ఎదుటే ఆత్మ‌హ‌త్య‌.. పోలీసుల తీరే కార‌ణ‌మ‌ని ఆరోప‌ణ‌

Suicide: హైద‌రాబాద్ న‌గ‌రంలోని మ‌ల్కాజిగిరి పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో దారుణ ఘ‌ట‌న చోటుచేసుకున్న‌ది. డ్రంక‌న్ డ్రైవ్‌లో ప‌ట్టుబ‌డిన త‌న‌తో పోలీసుల వ్య‌వ‌హ‌రించిన తీరుకు మ‌న‌స్తాపం చెందిన ఓ వ్య‌క్తి ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. ఏకంగా మ‌ల్కాజిగిరి పోలీస్ స్టేష‌న్ ఎదుటే త‌న‌కు తాను ఒంటిపై నిప్పంటించుకొని పెట్రోల్ పోసుకుని ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు.

Suicide: మ‌ల్కాజిగిరి ప‌రిధిలో నిన్న (న‌వంబ‌ర్ 4) అర్ధ‌రాత్రి రాత్రి పోలీసులు డ్రంక‌న్ డ్రైవ్ నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా మేడ్చ‌ల్ మ‌ల్కాజిగిరి జిల్లా ద‌మ్మాయిగూడ ప్రాంతానికి చెందిన సింగిరెడ్డి మీన్ రెడ్డి (32) ప‌ట్టుబ‌డ్డాడు. ఈ సంద‌ర్భంగా అత‌ని రీడింగ్ 120గా న‌మోదైన‌ట్టు పోలీసులు తెలిపారు. ఆ త‌ర్వాత సింగిరెడ్డి మీన్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Suicide: ఆ త‌ర్వాత అర్ధ‌రాత్రి దాటాక 2 గంట‌ల స‌మ‌యంలో మ‌ల్కాజిగిరి పోలీస్ స్టేష‌న్ ఎదుటే మీన్‌రెడ్డి త‌న ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. త‌న‌పై పోలీసులు వ్య‌వ‌హ‌రించిన తీరుతో తాను మ‌న‌స్తాపం చెందినట్టు అంత‌కు ముందు అక్క‌డి వారికి చెప్పిన‌ట్టి తెలిసింది. అర్ధ‌రాత్రి ఈ సంఘ‌ట‌న జ‌రిగింద‌ని పోలీసులు తెలిపారు. ఆ త‌ర్వాత పోలీస్ స్టేష‌న్‌కు వ‌చ్చిన మృతుడి కుటుంబ స‌భ్యులు, బంధువులు పోలీసుల‌పై ఆగ్ర‌హం వ్య‌క్తంచేశారు. పోలీసుల తీరుతోనే మీన్‌రెడ్డి ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడ‌ని ఆరోపించారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *