Allu Sirish

Allu Sirish: అల్లు శిరీష్ – నయనికా రెడ్డి నిశ్చితార్థం ఘనంగా

Allu Sirish: మెగా కుటుంబంలో మరో శుభకార్యం జరిగింది. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ చిన్న కుమారుడు, నటుడు అల్లు శిరీష్ నిశ్చితార్థం అక్టోబర్ 31న జూబ్లీహిల్స్‌లోని నివాసంలో ఘనంగా జరిగింది. వధువు నయనికా రెడ్డి హైదరాబాద్‌కు చెందిన వ్యాపార కుటుంబానికి చెందిన యువతి. ఈ వేడుకను కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు, బంధువులు, స్నేహితుల మధ్య సింపుల్‌గా కానీ ఎంతో ఎలిగెంట్‌గా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి, ఆయన సతీమణి సురేఖ, రామ్ చరణ్–ఉపాసన, అల్లు అర్జున్–స్నేహా, పవన్ కళ్యాణ్ గారి సతీమణి అన్నా, నాగబాబు–పద్మజ, వరుణ్ తేజ్–లావణ్య, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ తేజ్ తదితరులు హాజరయ్యారు. వీరంతా శిరీష్–నయనిక జంటను ఆశీర్వదించారు.

Also Read: Nani: హాలీవుడ్‌కు నాని అడుగు?

కార్యక్రమం అనంతరం సోషల్ మీడియాలో ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. అభిమానులు, సినీ ప్రముఖులు కొత్త జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. నయనిక భారతీయ చిత్ర పరిశ్రమలో విశిష్టమైన స్థానం కలిగిన కుటుంబానికి కోడలిగా మారబోతుండటంతో ఆమె కుటుంబం ఎంతో ఆనందంగా ఉంది.

ఇక పెళ్లి తేదీ, వేడుక జరిగే స్థలం గురించి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. అయితే అల్లు అరవింద్ ఈ వివాహాన్ని భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్నారని ఫిలింనగర్ వర్గాలు చెబుతున్నాయి. త్వరలోనే దీనిపై అధికారిక సమాచారం వెలువడే అవకాశం ఉంది.

 Allu Sirish

 Allu Sirish

 Allu Sirish

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *