Babu Pawan Msg: ఎన్ని ఉపద్రవాలు ఎదురైనా కూటమి అవిచ్ఛిన్నం, అజేయం. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇస్తున్న క్లియర్ కట్ మెసేజ్ ఇదేనా? అసెంబ్లీలో బాలకృష్ణ వ్యాఖ్యలపై రెండు పార్టీలు సంయమనం పాటిస్తున్నాయి. వివాదానికి కారణమైన కామినేని, బాలకృష్ణ వ్యాఖ్యల్ని రికార్డుల నుండి ఇప్పటికే తొలగించారు. ఇక ఐదు రోజులుగా వైరల్ ఫీవర్‌తో బాధపడుతున్న పవన్ కళ్యాణ్ పరామర్శకు పవన్ ఇంటికి స్వయంగా వెళ్లారు సీఎం చంద్రబాబు. పవన్ స్వయంగా గేటు వద్దకు వచ్చి సీఎంకు పుష్పగుచ్ఛంతో స్వాగతం పలికారు. ఏం చర్చించారన్న విషయం బయటకు రాలేదు. హెల్త్ పట్ల జాగ్రత్త వహించాలన్న సీఎం చంద్రబాబు పవన్ కళ్యాణ్‌కు కొన్ని హెల్త్ టిప్స్ సూచించారని మాత్రమే అధికార వర్గాల నుండి సమాచారం వస్తున్నప్పటికీ.. అసలు సంగతి కూడా చర్చించే ఉంటారన్నది అంతర్గత వర్గాల భోగట్టా.
బాబు, పవన్‌ల సైలెంట్ మెసేజ్‌తో ఫ్యాన్ వార్ సద్దుమణిగినప్పటికీ.. వైసీపీ ఆరాటం, పోరాటం మాత్రం ఐదు రోజులుగా వర్ణణాతీతం అని చెప్పాలి. ‘మెగాస్టార్‌కు ఇంత అవమానమా?’ అంటూ ఇంకా రెచ్చకొట్టే కథనాలు వండి వారుస్తూనే ఉన్నారు. మరి బాలకృష్ణ దెబ్బకు అసెంబ్లీ సాక్షిగా జగన్‌కు జరిగింది ఏమైనా సన్మానమా? అంటూ ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు. జగన్‌ను సైకోగా పేర్కొనడంపై వైసీపీకి ఏమాత్రం బాధ లేదా? ‘ఆపద్భాంధవుడు’ చిరంజీవిపై ప్రేమ అందుకే ఒలకబోస్తోందా? అంటూ తూర్పారబడుతున్నారు. ఎవరేమనుకున్నా మేమింతే అని దులిపేసుకుంటూ… రాజకీయ మైలేజీ కోసం తీవ్రంగా పాకులాడుతోందంటూ వైసీపీ తీరుపై విమర్శ వ్యక్తమవుతోంది.
Also Read: VC Sajjanar: నా స్టాప్ వచ్చేసింది.. హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన సజ్జనార్.
పవన్ ప్రజాసేవలో ఉన్నారు. ప్రజలకోసం నిత్యం కృషి చేస్తున్నారు. ఆయన ఆరోగ్యంగా ఉండడం రాష్ట్ర ప్రజలకు అవసరం. పవన్ త్వరగా కోలుకోవాలి. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి… అంటూ పవన్ కుటుంబ సభ్యులకు సూచించారట సీఎం చంద్రబాబు. బాబు, పవన్‌ల ఆత్మీయ బంధం కూటమి పార్టీల అన్యోన్యతను సూచిస్తోందంటున్నారు విశ్లేషకులు. చిరు-బాలయ్య ఎపిసోడ్‌తో వైసీపీ సంబరాలు, కూటమి పార్టీల మధ్యకొట్లాకు ప్రయత్నాలు, సినీ వర్గాలు, రాజకీయ వర్గాల మధ్య వైషమ్యాలు పెంచే ప్రయత్నాలు, కులాల మధ్య చిచ్చుపెట్టే కుటిల యత్నాలలు… బాబు-పవన్ ఒకే ఒక్క భేటీతో పటాపంచలు అయ్యాయంటున్నారు. ఇక ఆ ఏపిసోడ్‌పై మాట్లాడనన్నారు చిరు. లాస్ట్‌కి వైసీపీని టార్గెట్ చేసింది బాలయ్య అభిమాన వర్గం. ఎటు చూసినా చివరికి వైసీపీ ప్రయత్నం బెడిసి కొట్టిందనే చెప్తున్నారు పలువురు అనలిస్టులు.