Pawan OG Oochakotha

Pawan OG Oochakotha: సినిమా, పాలిటిక్స్‌.. పవన్‌ కళ్యాణ్‌కు ఏదీ ఊరికే రాలేదు!

Pawan OG Oochakotha: సెప్టెంబర్ 25, 2025.. థియేటర్లను కమ్మేసింది ఓజీ తుపాన్‌. ఈ యాక్షన్-క్రైమ్ థ్రిల్లర్‌లో పవన్‌ గతంలో ఎన్నడూ లేని విధంగా ఓజస్ గాంభీర అనే క్యారెక్టర్‌లో జీవించారు. ఒరిజినల్ గ్యాంగ్‌ స్టర్‌లా, ఫ్యాన్స్‌కి ఒరిజినల్‌ గాడ్‌లా చూపించడంలో ఫ్యాన్‌ బాయ్‌ డైరెక్టర్‌ సుజీత్‌ సక్సెస్‌ అయ్యారు. ఇక ఈ సినిమాకి సంగీతం అందించిన మ్యుజీషియన్‌ తమన్‌ గురించి చెప్పాల్సిన పనిలేదు. 10 సంవత్సరాల తర్వాత ముంబైకి తిరిగి వచ్చిన ఓజస్‌ గంభీర.. ముంబై అండర్‌వరల్డ్‌లో పాతుకుపోయిన క్రూయల్‌, క్రైమ్ లార్డ్‌లకు ఎలాంటి యుద్ధం ఇచ్చాడు అన్నదే మూవీ. నిజం చెప్పాలంటే.. సినిమాని నడిపించింది స్టోరీ కాదు కానీ.. ఓజస్‌ గంభీర చేతిలోని కత్తి అనేలా ఉంటుందీ మూవీ. ఫ్యాన్స్‌ అయితే ఖచ్చితంగా రిపీడ్‌ మోడ్‌లో సినిమాకి క్యూ కడతారు అనడంలో ఏ మాత్రం సందేహం లేదు. అసలే దసరా సెలవులు.. పది, పన్నెండేళ్లుగా ఆకలితో ఉన్న పులుల్లా కాచుకు కూర్చున్నారు పవన్‌ ఫ్యాన్స్‌. ఓజీతో దుమ్మురేపి వదలిపెడతారు అనడంలో నో డౌట్‌ అంటున్నారు సినీ విశ్లేషకులు.

ఇక్కడ మరో గుడ్‌ థింగ్‌ ఏంటంటే… ప్రీమియర్‌ షోతోనే నెగటివ్‌ రివ్యూల మోత మోగించాలని ప్లాన్‌ చేసుకున్నారు యాంటీ ఫ్యాన్స్‌. అయితే.. ఓజస్‌ గంభీర థియేటర్లలో భీభత్సం చేసి వదిలిపెట్టాడు. దీంతో నెగటివ్‌ రివ్యూలు ఇద్దాం అనుకున్న వాళ్లు కూడా భయపడ్డారు. ఓజీ సృష్టించిన బ్లడ్ బాత్‌కి యాంటీ ఫ్యాన్స్‌ కూడా ఫిదా అవుతారు అనేలా ఉంది అక్కడ భీభత్సం. ఎస్‌.. ఇది వాస్తవం. ఓజీ… ప్రేక్షకుల్ని ట్రాన్స్‌లోకి తీసుకెళ్లి అక్కడక్కడే చక్కర్లు కొట్టిస్తున్నాడు. మరోవైపు తమన్‌ బీజీఎమ్‌ మైండ్‌ నుండి వదిలి పోనంటూ మొండికేస్తుంది. ఆ ట్రాన్స్‌ నుండి బయటకు రాలేకపోతున్న ఫ్యాన్‌.. కూర్చున్న సీటు నుండి లేవకుండా మళ్లీ నెక్ట్స్‌ షో కూడా చూసే అదృష్టం ఉంటే ఎంత బాగుండేదో కదా అనుకుంటున్నారు. “పోతారు… మొత్తం పోతారు!” అంటూ రిలీజ్‌కు ముందే పవర్‌ స్టార్‌ ఫ్యాన్స్‌ ట్రెండ్‌ చేశారు కానీ.. నిజంగా వారిది ఊహించలేదు. అంచనాలు అందుకోవడం కాదు.. అంతకు మించి ఇచ్చిపడేశారు ఓజస్‌ గంభీర. నిజం చెప్పాలంటే ఫ్యాన్స్‌కు ఇది సినిమా కాదు.. సెలబ్రేషన్‌. మళ్లీ ఇలాంటిది దొరుకుతుందో లేదో తెలీని ఓ సెన్సేషన్‌.

Also Read: Chiranjeevi: బాలకృష్ణ వ్యాఖ్యలపై చిరంజీవి స్పందన: అసెంబ్లీలో చర్చకు క్లారిటీ ఇచ్చిన మెగాస్టార్

అయితే, ఓజీ సక్సెస్‌ వెనుక పవన్ కళ్యాణ్ పడ్డ కష్టం సామాన్యమైంది కాదు. 2021లో సుజీత్ నరేట్ చేసిన స్క్రిప్ట్‌పై ఓకే చెప్పిన పవన్, ‘హరి హర వీర మల్లు’ షూటింగ్ చేస్తూ కూడా ఓజీ ప్లాన్ చేశాడు. డీవీవీ దానయ్య ప్రొడక్షన్‌లో సినిమా పట్టాలెక్కింది. ఒక్కోసారి 3-5 రోజులు మాత్రమే కాల్‌ షీట్లు అలాట్ చేసి, జూన్ 7, 2025కి తన పార్ట్స్ వెర్షన్‌ కంప్లీట్‌ చేశాడు పవన్‌. జూలై 2025కి ఫుల్ షూట్ పూర్తయింది. 3 సంవత్సరాల టైం పీరియడ్లో… ఓజీ కోసం పవన్ కటానా ఫైట్స్, మార్షల్ ఆర్ట్స్ లో ట్రైనింగ్ తీసుకున్నాడు. బాడీ ఫిట్‌నెస్‌ పక్కాగా ఉండేలా చూసుకున్నాడు. దాంతో తొలిప్రేమ, తమ్ముడు, ఖుషీ నాటి వింటేజ్‌ వైబ్స్‌ని మళ్లీ తెరపై చూడగలుగుతున్నారు పవన్‌ ఫ్యాన్స్‌. డిప్యూటీ సీఎంగా సక్సెస్‌ఫుల్‌గా విధులు నిర్వర్తిస్తున్న పవన్‌ డెడికేషన్‌కి ఇదో ఎగ్జాంపుల్.

జూన్ 2024 నుంచి ఆంధ్రప్రదేశ్ డెప్యూటీ సీఎం‌గా, పంచాయతీ రాజ్, రూరల్ డెవలప్‌మెంట్, రూరల్ వాటర్ సప్లై, ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్స్, సైన్స్ & టెక్నాలజీ మినిస్టర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు పవన్‌ కళ్యాణ్‌. ప్రజల్ని మెప్పించడానికి, జనసేన కార్యకర్తల్ని ఇన్‌స్పైర్ చేయడానికి నిత్యం టూర్స్, మీటింగ్స్ కామన్‌. పిఠాపురం ఎమ్ఎల్‌ఏగా కూడా లోకల్ ఇష్యూస్‌లో డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అవుతున్నారు. జీవితాన్ని పణంగా పెట్టి, అటు ప్రజల కోసం పాలిటిక్స్, ఇటు ఫ్యాన్స్ కోసం సినిమాలు చేస్తున్న పవన్‌ది డ్యూయల్ రెస్పాన్సిబిలిటీ. ఈ పని ఒత్తిడిలో ఇటీవల కాలంలో కొంత నలిగినా… ఓజీ సక్సెస్‌తో మళ్లీ రైజ్ అయ్యాడు ప్రజల స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *