YCP Target Savitha

YCP Target Savitha: వైసీపీ ఆల్‌ లీడర్స్‌ ఆమెనే టార్గెట్‌ ఎందుకు చేస్తున్నట్లు?

YCP Target Savitha: ఆంధ్రప్రదేశ్‌లో మెడికల్ కాలేజీల ఇష్యూ రాజకీయ రగడకు కారణమవుతోంది. వైసీపీ, టీడీపీ నాయకుల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఈ అంశంలో రాయలసీమలోని శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ ఎమ్మెల్యే, రాష్ట్ర బీసీ సంక్షేమ, చేనేత శాఖ మంత్రి సవితమ్మను వైసీపీ నాయకులు ప్రధానంగా టార్గెట్ చేస్తున్నారు. మాజీ మంత్రులు సోషల్ మీడియా ద్వారా ఆమెపై విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే, మంత్రి సవితమ్మ మాత్రం వైసీపీ ఆరోపణలను లెక్కచేయకుండా, “గత ఐదేళ్లలో వైసీపీ ఎన్ని మెడికల్ కాలేజీలు నిర్మించింది? ఎంత ఖర్చు చేసింది? ఓపెన్ డిబేట్‌కు రండి!” అంటూ సవాల్ విసిరారు. పెనుగొండలో మెడికల్ కాలేజ్ నిర్మాణం ఓటు బ్యాంకు రాజకీయాల కోసమేనని, వైసీపీకి అభివృద్ధి గురించి మాట్లాడే ధైర్యం లేదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. “కూటమి ప్రభుత్వం 15 నెలల్లో చేసిన సంక్షేమ, అభివృద్ధి పనులను ప్రజల ముందు వివరించే ధైర్యం నాకుంది. మీరు చర్చకు సిద్ధమా?” అంటూ వైసీపీ నేతలకు సవాల్ చేశారు మంత్రి సవిత.

Also Read: Jacqueline Fernandez: మనీలాండరింగ్ కేసు: సుప్రీంకోర్టులో నటి జాక్వెలిన్‌కు ఎదురుదెబ్బ

పెనుగొండ నియోజకవర్గంలో సవితమ్మ భారీ మెజారిటీతో గెలిచి, టీడీపీలో ఫైర్‌బ్రాండ్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. బీసీ సంక్షేమ, చేనేత శాఖల్లో చేపట్టిన అభివృద్ధి, విప్లవాత్మక కార్యక్రమాలతో పాటు, కడప జిల్లా ఇంచార్జ్‌ మంత్రిగా కడప మహానాడును విజయవంతం చేశారు. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లోనూ టీడీపీ జెండా ఎగరడంలో ఆమె కీలక పాత్ర పోషించారు. ఈ విజయాలతో సీఎం చంద్రబాబు, నారా లోకేష్ ప్రశంసలు అందుకున్నారు మంత్రి సవిత. ఆమె శాఖకు కేంద్రం నుంచి స్కాచ్ అవార్డు కూడా లభించింది. అటు వైసీపీ మాజీ మహిళా మంత్రులైన ఆర్కే రోజా, ఉషశ్రీ చరణ్‌లపై సవిత తీవ్ర విమర్శలు చేస్తున్నారు. రోజా టీటీడీ టికెట్ల అమ్మకంతో కోట్లు సంపాదించారని, ఉషశ్రీ కళ్యాణదుర్గంలో అవినీతికి పాల్పడ్డారని, కావాలంటే ఆధారాలతో నిరూపిస్తాననీ, ధైర్యం ఉంటే డిబేట్‌కు రావాలని సవాల్ చేశారు. వైసీపీ నేతలు అసభ్య భాషతో రాజకీయం చేస్తున్నారని, టీడీపీ సంస్కారవంతమైన రాజకీయాలకు కట్టుబడి ఉందన్నారు మంత్రి సవితమ్మ. ఎమ్మెల్యేగా, మంత్రిగా, నియోజకవర్గంలోనూ, తన శాఖలోనూ విజయాలతో దూసుకుపోతున్న సవితమ్మ.. టీడీపీలో మహిళా ఫైర్‌ బ్రాండ్లలో ఒకరిగా.. వైసీపీకి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. చెప్పాలంటే జగన్‌ మెడికల్‌ కాలేజీల వ్యవహారాన్ని లైవ్‌లో బట్టబయలు చేసి వైసీపీని షేక్‌ చేసింది మొట్టమొదటగా మంత్రి సవితమ్మే. ఆ తర్వాతే వైసీపీలో కానీ, కూటమిలో కానీ నేతలు మెడికల్‌ కాలేజీలకు క్యూ కట్టారు. సెల్ఫీ వీడియోల ట్రెండ్‌ని ఫాలో అవుతున్నారు.

సీఎం చంద్రబాబు సూచనలతో మంత్రి సవిత వైసీపీ ఫేక్ ప్రచారాన్ని తిప్పికొడుతూ, అభివృద్ధి వివరాలను ప్రజలకు వివరిస్తున్నారు. పెనుగొండలో వైసీపీ రాజకీయ కుట్రలను ధీటుగా ఎదుర్కొంటూ, టీడీపీలో డైనమిక్ నాయకురాలిగా ముందుకు సాగుతున్నారు. అందుకే ఆమె వైసీపీకి ప్రధాన టార్గెట్‌గా మారారంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఏది ఏమైనా వైసీపీ రాజకీయాలను, ఫేక్‌ ప్రచారాలను ప్రజా క్షేత్రంలో ఎండగట్టడంలో తగ్గేదేలేదు అంటున్నారు మంత్రి సవితమ్మ.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *