Crime News:

Crime News: వివాహేత‌ర బంధానికి అడ్డుగా ఉన్నాడ‌ని భ‌ర్త‌పై ప్రియుడితో క‌లిసి భార్య‌ మ‌రో ర‌కం దాడి

Crime News: వివాహేత‌ర బంధాలు అయిన వారిపై దాడులు, దౌర్జ‌న్యాలు, హ‌త్య‌ల‌కు దారి తీస్తున్నాయి. గ‌తానికి భిన్నంగా ఇటీవ‌ల వివాహేత‌ర బంధాలు పెట్టుకున్న మ‌హిళ‌లు త‌మ‌ భ‌ర్త‌ల‌పై దాడుల‌కు తెగ‌బ‌డుతున్నారు. ఇండోర్‌లో భ‌ర్త‌ను చంపి, డ్ర‌మ్ముల్లో శ‌రీర భాగాల‌ను దాచి ఉంచిన మ‌హిళ ఘ‌ట‌న నాటి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కూ అలాంటి ఘ‌ట‌న‌లు మితిమీరి పోతున్నాయి. ఇక్క‌డ కూడా అలాంటిదే జ‌ర‌గ‌బోగా, త‌న భార్య, ఆమె ప్రియుడి నుంచి ఆమె భ‌ర్త త‌ప్పించుకొని ప్రాణాల‌ను కాపాడుకున్నాడు.

Crime News: మ‌హ‌బూబాబాద్ జిల్లా మ‌హ‌బూబాబాద్ మండ‌లం గ‌డ్డిగూడెం తండాలో అనిల్ అనే వ్య‌క్తితో ఓ మ‌హిళ‌ వివాహేత‌ర సంబంధం పెట్టుకున్న‌ది. ఈ విష‌యం భ‌ర్త‌కు తెలియ‌డంతో వారించాడు. వివాహేత‌ర బంధాన్ని మానుకోవాల‌ని ప‌లుమార్లు హిత‌వు ప‌లికాడు. అయినా ఆమె మానుకోక‌పోగా, త‌న వివాహేత‌ర బంధానికి త‌న భ‌ర్త అడ్డొస్తున్నాడ‌ని భావించింది. దీంతో ఎలాగైనా ఆయ‌న అడ్డు తొల‌గించుకోవాల‌ని ప్లాన్ చేసింది.

Crime News: అనుకున్న ప్లాన్ ప్ర‌కారం.. ఆ మ‌హిళ త‌న ప్రియుడిని ఇంటికి ర‌ప్పించుకున్న‌ది. వారిద్ద‌రూ క‌లిసి ఆమె భ‌ర్త‌ను చంపే క్ర‌మంలో రెండు చెవుల‌ను కోశారు. దీంతో బాధితుడు ప్రాణ‌భ‌యంతో కేక‌లు వేస్తూ, ప‌రుగులు తీశాడు. ఆయ‌న కేక‌లు విన్న స్థానికులు వారింటికి చేరుకున్నారు. ఇదే స‌మ‌యంలో ఆ మ‌హిళ ప్రియుడు పారిపోయేందుకు ప్ర‌య‌త్నించ‌గా, స్థానికులు ప‌ట్టుకొని చిత‌క‌బాదారు.

Crime News: తీవ్ర ర‌క్త‌స్రావ‌మై గాయాల‌పాలైన ఆ మ‌హిళ భ‌ర్త‌ను స్థానికులు ఆసుప‌త్రికి త‌రలించారు. స్థానిక పోలీసుల‌కు స‌మాచారం ఇచ్చారు. ఈ మేర‌కు ఘ‌ట‌నా స్థ‌లానికి వ‌చ్చిన పోలీసులు కేసు న‌మోదు చేసుకొని ద‌ర్యాప్తు ప్రారంభించారు. క్ష‌ణ‌కాలం సుఖం కోసం, క్ష‌ణ‌కావేశాలతో అయిన వారిని వ‌దిలించుకునేందుకు ఎంత‌కైనా తెగిస్తున్నారంటే స‌భ్య‌స‌మాజం ఆందోళ‌న వ్య‌క్తంచేస్తున్న‌ది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *