Bomb Threat: తిరువనంతపురంలో మరోసారి బాంబు బెదిరింపులు కలకలం రేపాయి. పద్మనాభస్వామి ఆలయానికి బాంబు ఉన్నట్లు కాల్ రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇదే సమయంలో అట్టుకల్ అమ్మవారి ఆలయానికి కూడా బాంబు బెదిరింపు కాల్ రావడంతో అధికారులు హడలెత్తిపోయారు.
తక్షణమే ఆలయ పరిసరాలకు పోలీసులు, బాంబు స్క్వాడ్ చేరుకుని తనిఖీలు ప్రారంభించారు. భక్తులను సురక్షితంగా బయటకు పంపించి ఆలయ ప్రాంగణంలో ప్రతి మూలను ఖాళీ చేసి తనిఖీలు కొనసాగిస్తున్నారు.
అధికారులు ఈ బెదిరింపులను సీరియస్గా తీసుకుని కాల్ చేసిన వ్యక్తిని గుర్తించేందుకు దర్యాప్తు ప్రారంభించారు. రెండు ప్రముఖ ఆలయాలకు వచ్చిన బాంబు బెదిరింపుతో స్థానికులు, భక్తుల్లో ఆందోళన నెలకొంది.
