Jagan Taking About Babu

Jagan Taking About Babu: జగన్‌ భయాలు, భ్రమలు, ప్యాలస్‌ ఫీట్లు..!

Jagan Taking About Babu: జగన్‌ ప్లాన్లు వర్కౌట్ అవుతాయా? అంటే అవ్వవు బ్రో అంటున్నారు వైసీపీ నేతలు, కార్యకర్తలు. అవును… జగన్‌ కొలవెర్రి వేషాలపై ఆ పార్టీ నాయకత్వంలోనే భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. క్యాడర్‌లో అసంతృప్తి జ్వాలలు రగులుతున్నాయి. ఎంచేతనంటారా…. అసెంబ్లీకి పోడు. ధర్నాలకు పిలుపిస్తాడు.. కార్యకర్తల్ని కేసుల్లో ఇరికిస్తాడు. తాను మాత్రం ప్యాలస్‌లో పడుకుంటాడు. అసలు ఈ మనిషి రాజకీయం అర్థకాక జుట్టు పీక్కోవాల్సి వస్తుందంటున్నారు భవిష్యత్తుపై ఆశలు పెట్టుకున్న పలువురు వైసీపీ నాయకులు, కార్యకర్తలు. అసలు అసెంబ్లీకి, ప్రజల్లోకి వచ్చేందుకు అతనికున్న భయాలేంటో అర్థమై చస్తేనా.. అంటూ తలలు బాదుకుంటున్నారు.

ఇప్పుడు కూడా ప్యాలస్‌లో కూర్చుకుని ప్రెస్మీట్‌ పెట్టాడు జగన్‌ మోహన్‌రెడ్డి. చంద్రబాబును తిడుతూ 2 గంటల పాటు కాలక్షేపం చేశాడు. దీని వల్ల ప్రయోజనం ఏమైనా ఉంటుందా? అంటే ఎవరి మాట వినని సీతయ్య టైపు. అసెంబ్లీకి వెళ్తే తనకు మైక్‌ ఇవ్వరని, సమయం ఇవ్వరని, మాట్లాడుతుండగా మైక్‌ కట్‌ చేస్తారని, తానే ఊహించుకుంటూ.. ఎక్కడ తనకి అవమానాలు ఎదురవుతాయోనని భయపడుతూ… నేను ప్యాలస్‌లో కూర్చుని ప్రెస్మీట్‌ పెట్టడమే అసెంబ్లీకి వెళ్లడం కన్నా ఉత్తమం అంటూ తనని తానే సమర్థించుకుంటున్నాడు. చంద్రబాబు ఈ భూమ్మీద బతికుండగా.. తనకు మనశ్శాంతి ఉండదు, కంటి మీద కునుకు ఉండదు, తన రాజకీయంలో పస ఉండదు అన్నట్లుగా ఉలికిపాటుకు గురవుతున్నారు. పదే పదే చంద్రబాబు వయసు గురించి మాట్లాడుతూ.. చంద్రబాబుకు ఇదే ఆఖరి ఎన్నిక అంటూ ఆయనే డిసైడ్‌ చేసేస్తున్నారు. 75 ఏళ్ల చంద్రబాబు రోజుకు 17, 18 గంటలు పనిచేస్తున్నారు. ఇవాళ కూడా అనంతపురం సభలో మండుటెండలో స్టేజిపైన గంట సేపు నిలబడి నిప్పులు చెరిగే ప్రసంగం ఇచ్చాడు చంద్రబాబు. జగన్‌ మాత్రం ప్యాలస్‌లో, ఏసీ గదిలో, కాలు కదపకుండా, చొక్కా నలగకుండా, సెలెక్టెడ్‌ మీడియాతో, స్క్రిప్టెడ్‌ ప్రెస్మీట్లు పెడుతూ.. చంద్రబాబును తిడుతూ కాలక్షేపం చేశాడు.

Also Read: Devil’s Astrologer: నేపాల్ రాజకీయ పరిణామాలను 2 ఏళ్ల క్రితమే ఊహించిన జ్యోతిష్కుడు.. ఏమి చెప్పాడంటే

ఇక రాని ప్రతిపక్ష నేత హోదా కోసం పట్టువదలని విక్రమార్కుడి రేంజ్‌లో రగిలిపోతున్నాడు వైసీపీ అధినేత జగన్‌మోహన్‌ రెడ్డి. హోదా అడుగుతున్నాడు కానీ.. ప్రజల్లో ఆ బాధ్యత నిర్వర్తిస్తున్నాడా? అంటే కాదు. తాడేపల్లి ప్యాలస్‌లో కూర్చొని సోషల్‌ మీడియాలో విమర్శలు చేస్తూ కాలక్షేపం చేస్తున్నాడు. అధికారంలో ఉన్నప్పుడు సంక్షేమ పథకాలు అమలు చేసినా ప్రజలు నమ్మలేదు. ఇప్పుడు ప్యాలస్‌లో కూర్చుని విమర్శలు చేస్తే నమ్ముతారా? చరిత్రలో ఏ నాయకుడైనా ఇలా ప్రజలకు దూరంగా ఉంటూ అధికారం ఆశించాడా? పార్టీ క్యాడర్‌ను, ప్రజలను తనను నమ్మమంటాడు కానీ, వారి అభిప్రాయాలను గౌరవించడు. ఢిల్లీలో బీజేపీకి మద్దతు ఇస్తూ, రాష్ట్రంలో ఎన్డీఏకు వ్యతిరేకంగా రైతు పోరు నిర్వహిస్తాడు. 11 సీట్లకు పడగొట్టిన ఎన్డీయేకి… ఎప్పుడు మద్ధతివ్వాలన్నా సరే అందరికన్నా ముందుంటాడు. ఇక్కడేమో ఈవీఎంల వల్లే గెలిచారంటూ గోల చేస్తాడు. అక్కడేమో మోడీ ప్రసన్నం కోసం పాకులాడుతూ ఉంటాడు. కాళ్ల బేరానికీ వెనుకాడడు. ఇది నమ్ముకున్న వారిని, ఓట్లేసిన వారిని మోసం చేయడం కాదా? తన నేరాల నుంచి రక్షణ కోసం ఎన్డీయేకు ఈ ఊడిగం మా అన్న ఎన్నాళ్లు చేయాలో అంటూ సొంత క్యాడరే విస్తుపోతున్నారు. ఒక్కటి మాత్రం నిజం. జరగబోయే వాస్తవం. ప్రజలకు చైతన్యం వచ్చిన రోజు… పులివెందులలోనూ ఫ్యాను పీకి స్టోర్‌ రూంలో పడేస్తారు.

ALSO READ  KMM Kallur Candidate: కొత్త నియోజకవర్గం పట్టాభికి ఫిక్స్‌ అయ్యిందా?

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *