Cockroach In Mandi

Cockroach In Mandi: బిర్యానీలో బొద్దింక.. ఏం కాదులే అన్న ఓనర్.. ఎక్కడంటే.. ?

Cockroach In Mandi: హైదరాబాద్ బిర్యానీ పేరు విన్న చాలు నోరూరించే వంటకం. ఈ వంటకాన్ని రుచి చూడటానికి దేశం నలుమూలల నుంచి పర్యాటకులు నగరానికి వస్తుంటారు. అయితే, కొందరు హోటల్‌ నిర్వాహకుల నిర్లక్ష్యం కారణంగా ఈ రుచికరమైన వంటకం ఇప్పుడు భయపెట్టే స్థాయికి చేరింది. శుభ్రత, నాణ్యత, హైజీన్ అనే పదాలు కొన్ని హోటల్స్‌కు దూరమైపోయినట్టు కనిపిస్తోంది.

తాజాగా ముషీరాబాద్‌లోని అరేబియన్ మండి రెస్టారెంట్‌లో ఘోర నిర్లక్ష్యం బయటపడింది. స్నేహితులతో కలిసి బిర్యానీ ఆర్డర్ చేసిన కస్టమర్‌ ప్లేట్‌లో బొద్దింక ప్రత్యక్షమవడంతో షాక్‌కు గురయ్యారు. వెంటనే రెస్టారెంట్‌ యాజమాన్యాన్ని ప్రశ్నించగా, వారు నిర్లక్ష్య ధోరణితో సమాధానం ఇవ్వడంతో కస్టమర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు, ఈ ఘటనపై ఫిర్యాదు చేయడానికి ప్రయత్నించిన వారిపైనే ఒత్తిడి తెచ్చి బయటకు పంపాలని రెస్టారెంట్‌ సిబ్బంది ప్రయత్నించారని ఆరోపణలు ఉన్నాయి.

ఇది కూడా చదవండి: Telangana: తెలంగాణ స‌ర్కార్‌ మ‌రో వినూత్న కార్య‌క్ర‌మం

ఈ సంఘటనతో ఆగ్రహించిన కస్టమర్లు హోటల్ ముందు ఆందోళన చేశారు. పోలీసుల జోక్యంతో పరిస్థితి శాంతించినా, ఈ ఘటనపై వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

హైదరాబాద్ నగరంలోని హోటల్స్‌పై ఫుడ్ సేఫ్టీ అధికారులు తరచూ తనిఖీలు చేస్తున్నప్పటికీ, కొందరు హోటల్ నిర్వాహకులు మాత్రం మార్పు చూపడం లేదు. బిర్యానీ ప్రేమికులు ఇప్పుడు ఈ నిర్లక్ష్యం కారణంగా రెస్టారెంట్లకు వెళ్లడానికి వెనుకంజ వేస్తున్నారు.

ప్రజలు ఈ ఘటనపై తీవ్రంగా స్పందిస్తూ, “ఇకనైనా ఫుడ్ సేఫ్టీ అధికారులు కఠిన చర్యలు తీసుకుని హోటల్ నిర్వాహకులకు బుద్ధి చెప్పాలి” అని డిమాండ్ చేస్తున్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Mynampally Hanumanth Rao: ఇంకా ప్రభుత్వంలోనే..ఉన్నామనే భ్రమలో బీఆర్‌ఎస్‌ ఉంది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *