Submarine Cable

Submarine Cable: ఎర్ర సముద్రంలో కేబుల్స్ తెగడంతో ఇంటర్నెట్ సేవలకు అంతరాయం

Submarine Cable: ఎర్ర సముద్రంలో సముద్ర గర్భంలో అంతర్జాతీయ ఇంటర్నెట్ కనెక్టివిటీకి కీలకమైన సబ్‌మెరిన్ ఫైబర్-ఆప్టిక్ కేబుల్స్ తెగిపోయాయి. ఈ ఘటన సెప్టెంబర్ 7, 2025 (ఆదివారం) నాడు జరిగింది. సౌదీ అరేబియాలోని జిద్దా సమీపంలో ఈ సమస్య ఏర్పడగా, భారతదేశం, పాకిస్తాన్, యూఏఈ వంటి దేశాల్లో ఇంటర్నెట్ వేగం గణనీయంగా తగ్గింది. ఈ అంతరాయం ప్రపంచ డిజిటల్ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపింది.

ఈ సంఘటనలో SEA-ME-WE-4, IMEWE, FALCON, GCX వంటి ప్రధాన సబ్‌మెరిన్ ఫైబర్-ఆప్టిక్ కేబుల్ వ్యవస్థలు దెబ్బతిన్నాయి. ఈ కేబుల్స్ ఆసియా, మధ్యప్రాచ్యం, యూరప్‌లను అనుసంధానం చేస్తాయి. SEA-ME-WE-4ను టాటా కమ్యూనికేషన్స్ నిర్వహిస్తుండగా, IMEWEను ఆల్కాటెల్-లూసెంట్ నేతృత్వంలోని కన్సార్టియం పర్యవేక్షిస్తోంది. ఈ కంపెనీలు ఇంకా అధికారికంగా స్పందించలేదు. అయితే, పాకిస్తాన్ టెలికమ్యూనికేషన్స్ కంపెనీ ఈ అంతరాయంపై ప్రకటన విడుదల చేసింది.

Also Read: Zelensky: భారత్‌పై ఆంక్షలు విధించడంలో తప్పులేదు.. ట్రంప్ కి ఉక్రెయిన్ అధ్యక్షుడు సపోర్ట్..

ఈ కేబుల్స్ తెగడంతో భారతదేశం, పాకిస్తాన్, యూఏఈ, సౌదీ అరేబియా, ఇజ్రాయెల్ వంటి దేశాల్లో ఇంటర్నెట్ సేవలు తగ్గిపోయాయి. కొన్ని ప్రాంతాల్లో 85-90% కనెక్టివిటీ కోల్పోయినట్లు నిపుణులు తెలిపారు. యూఏఈలో డు, ఎటిసలాట్ నెట్‌వర్క్ వినియోగదారులు ఇంటర్నెట్ వేగం తగ్గినట్లు ఫిర్యాదు చేశారు. మైక్రోసాఫ్ట్ అజూర్ క్లౌడ్ సేవలపై కూడా ఈ అంతరాయం ప్రభావం చూపింది. మైక్రోసాఫ్ట్ డేటాను మరో మార్గంలో పంపిస్తోంది, కానీ వేగం తగ్గిన సమస్య ఇంకా అలాగే ఉంది. ఈ కేబుల్స్ తెగడానికి ఖచ్చితమైన కారణం ఇంకా స్పష్టంగా తెలియలేదు. సాధారణంగా, వాణిజ్య నౌకల యాంకర్లు లేదా సహజ విపత్తులు లాంటి భూకంపాల వల్ల ఇలాంటి సమస్యలు తలెత్తుతాయి. ఈ ఘటనపై మరింత సమాచారం కోసం విచారణలు జరుగుతున్నాయి.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  ఎవరీ జానీ మాస్టర్ ... బ్యాక్ గ్రౌండ్ ఎంటీ?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *