Ranga Sudha

Ranga Sudha: ప్రముఖ నటి రంగ సుధపై అసభ్యకర పోస్టులు.. పోలీసులకు ఫిర్యాదు

Ranga Sudha: ప్రముఖ సినీ నటి రంగ సుధపై సోషల్ మీడియాలో అభ్యంతరకరమైన పోస్టులు వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆమె పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనపై అసభ్యకరమైన పోస్టులు పెడుతున్న రాధాకృష్ణ అనే వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు.

Also Read: Chase Teaser: ధోని ఇప్పుడు యాక్షన్ హీరో! ‘ది చేజ్’ టీజర్‌తో అభిమానులు ఫిదా!

నటి రంగ సుధ గతంలో రాధాకృష్ణతో కలిసి ఉన్నారు. ఆ సమయంలో వారిద్దరి వ్యక్తిగత వీడియోలు, ఫోటోలు రాధాకృష్ణ దగ్గర ఉన్నాయని, వాటిని ఆన్‌లైన్‌లో పెట్టి బెదిరించాడని రంగ సుధ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రస్తుతం కొన్ని ట్విట్టర్ ఖాతాలతో పాటు రాధాకృష్ణ కూడా తనపై అసభ్యకరమైన పోస్టులు పెడుతున్నారని ఆమె తెలిపారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సైబర్ నేరాలను నియంత్రించడానికి కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. సోషల్ మీడియాలో ఇలాంటి అసభ్యకరమైన పోస్టులు చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *