Crime News

Crime News: విశాఖలో దారుణం.. మూగ బాలికపై అత్యాచారం

Crime News: మద్యం తాగగానే మనుషుల్లో  ఉన్న మృగం బయటికి వస్తుంది కొంతమందికి ఆ టైమ్ లో ఎవరు ఏం చేస్తారో కూడా ఎవరికి తెలియదు. మధ్య మత్తులో ఉన్న ఇద్దరు కామాంధుల కామానికి విశాఖపట్నంలో 13 ఏళ్ల మూగ బాలిక బలైంది.

వివరాల్లోకి వెళితే..

విశాఖపట్నంలో లోని ఆదివారం రాత్రి సీతమ్మధార ప్రాంతంలో నివసించే మానసిక సమస్యలు ఉన్న 13 ఏళ్ల మూగ బాలికపై ఇద్దరు స్థానిక బాలురు అమానుషంగా అత్యాచారానికి పాల్పడ్డారు.

సమాచారం తెలిసిన వెంటనే బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనను పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చీ తీవ్రంగా పరిగణించారు. ద్వారక పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఈ ఘటనలో నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

ఇది కూడా చదవండి: Jagan Annadatha: తాంబూలాలు ఇచ్చేశాం… తన్నుకోండంటూ…

ప్రాథమిక విచారణలో, మద్యం మత్తులో ఉన్న ఇద్దరు బాలురు బాలికను బలవంతంగా పొదల్లోకి లాక్కెళ్లి దారుణానికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. “తనను వదిలేయండి” అని బాలిక వేడుకున్నా, ఆమెను విడిచిపెట్టలేదని దర్యాప్తులో బయటపడింది.

ప్రస్తుతం నిందితులపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ద్వారక పోలీసులు వెల్లడించారు. ఈ సంఘటనతో స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, నిందితులకు కఠిన శిక్షలు విధించాలని డిమాండ్ చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *