Meenakshi Chaudhary: మీనాక్షి చౌదరి టాలీవుడ్లో వరుస హిట్స్‌తో దూసుకెళ్తున్న ఈ యంగ్ బ్యూటీ ఇప్పుడు బాలీవుడ్‌పై కన్నేసింది. జాన్ అబ్రహాం హీరోగా నటిస్తున్న ‘ఫోర్స్ 3’ చిత్రంలో హీరోయిన్గా మీనాక్షి ఎంపికైందని సమాచారం. ఈ యాక్షన్ థ్రిల్లర్ సిరీస్‌లో భాగమైన ఈ చిత్రం ఆమెకు బాలీవుడ్లో బిగ్ బ్రేక్ ఇవ్వనుంది. టాలీవుడ్లో స్టార్ హీరోలతో పాటు యంగ్ హీరోల సినిమాల్లోనూ నటిస్తూ ఆకట్టుకున్న మీనాక్షి, ఈ అవకాశంతో జాతీయ స్థాయిలో సత్తా చాటేందుకు సిద్ధమవుతోంది. ‘ఫోర్స్’ సిరీస్‌కు ఉన్న క్రేజ్‌ను దృష్టిలో ఉంచుకుంటే, ఈ చిత్రం ఆమె కెరీర్లో కీలకమైన మైలురాయిగా నిలవనుంది. అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది. మీనాక్షి ఈ సినిమాతో బాలీవుడ్లో ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి.
