Gold Rate Today:దేశవ్యాప్తంగా బంగారం ధరలు పతంగిలా ఎగురుతున్నాయి. తగ్గే సూచనలు కనిపించకపోవడంతో పెట్టుబడిదారులు, నగల వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. ఢిల్లీలో 10 గ్రాముల బంగారం ధర రూ.1,07,070 చేరి మరోసారి రికార్డు స్థాయికి చేరుకుంది. వరుసగా 80వ రోజూ బంగారం ధర పెరగడం మార్కెట్‌లో చర్చనీయాంశంగా మారింది.
ఫెడ్ వడ్డీ రేట్లు తగ్గించే అవకాశాలు, ట్రంప్ సుంకం ప్రభావం, అంతర్జాతీయ రాజకీయ ఉద్రిక్తతలు, అమెరికా ఆర్థిక పరిస్థితులపై ఉన్న అనిశ్చితి – ఇవన్నీ కలసి బంగారాన్ని పెట్టుబడిదారులకు సేఫ్ హావన్‌గా మలుస్తున్నాయి. ఫలితంగా ధరలు అంతర్జాతీయ మార్కెట్‌తో పాటు దేశీయ మార్కెట్లలో కూడా చరిత్రాత్మక గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయి.
ప్రధాన నగరాల్లో బంగారం ధరలు:
| నగరం | బంగారం 24కే (10గ్రా) | బంగారం 22కే (10గ్రా) | వెండి (₹/కిలో) |
|---|---|---|---|
| ఢిల్లీ | ₹1,07,070 | ₹98,100 | ₹1,27,100 |
| ముంబై | ₹1,06,980 | ₹98,060 | ₹1,27,050 |
| హైదరాబాద్ | ₹1,06,980 | ₹98,060 | ₹1,27,000 |
| చెన్నై | ₹1,06,980 | ₹98,060 | ₹1,27,020 |
| బెంగళూరు | ₹1,06,980 | ₹98,060 | ₹1,27,080 |
| కోల్‌కతా | ₹1,07,000 | ₹98,080 | ₹1,27,090 |
| జైపూర్ | ₹1,06,960 | ₹98,050 | ₹1,27,070 |
ఇది కూడా చదవండి: Horoscope Today: వారికి ఆదాయానికి లోటుండదు.. 12 రాశుల వారికి రాశిఫలాలు
వెండి ధరలు కూడా ఎగబాకుతున్నాయి
బంగారం ధరల పెరుగుదలతో పాటు వెండి ధరలు కూడా కిలోకు రూ.1,27,100 (అన్ని పన్నులతో కలిపి) చేరి పెట్టుబడిదారులను ఆకర్షిస్తున్నాయి.
నిపుణుల అంచనా
మార్కెట్ విశ్లేషకుల ప్రకారం, భవిష్యత్తులో బంగారం ధరల్లో తగ్గుదల అవకాశాలు కనిపించడం లేదు. అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులు, డాలర్ బలహీనత, ఫెడ్ నిర్ణయాలు – ఇవన్నీ కలసి బంగారానికి మరింత డిమాండ్ తెచ్చే అవకాశం ఉంది.
