Spirit

Spirit: బరువు తగ్గనున్న ప్రభాస్.. స్పిరిట్ కోసం డార్లింగ్ తిప్పలు..

Spirit: పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ కెరీర్‌లో 25వ చిత్రంగా తెరకెక్కుతున్న ‘స్పిరిట్’ పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ చిత్రాన్ని సెన్సేషన్‌ డైరెక్టర్‌ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్నారు. ఇప్పటివరకు అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ వంటి  లవ్ అండ్ సెల్ఫ్ డిస్ట్రక్షన్ వంటి ఇంటెన్స్‌ కథలను తెరకెక్కించిన ఇండస్ట్రీ హిట్ కొట్టిన వంగా, ఈసారి మరింత డార్క్‌ జోనర్‌లోకి అడుగుపెడుతున్నారు. ‘స్పిరిట్’‌ను పూర్తిగా సూపర్‌నేచురల్ థ్రిల్లర్గా రూపొందించనున్నట్టు సమాచారం వస్తుంది. 

ప్రభాస్‌ కొత్త లుక్‌తో సర్ప్రైజ్!

ఈ చిత్రంలో ప్రభాస్‌ ఇప్పటివరకు ఎప్పుడూ కనిపించని పూర్తిగా భిన్నమైన లుక్‌లో కనిపించనున్నారు. పాత్రకు తగ్గట్టుగా ఆయన గణనీయంగా బరువు తగ్గి, కొత్త హెయిర్‌ స్టైల్‌, ప్రత్యేకమైన కాస్ట్యూమ్స్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. స్ర్కిప్ట్‌ డిమాండ్‌ మేరకు ఈ లుక్‌  ట్రై చేయనున్నారు. తన కంఫర్ట్‌ జోన్‌ నుండి బయటికి వచ్చి ఈ సినిమాలో నటించనున్నారు.

స్పెషల్ షెడ్యూల్ – ఆరు నెలల్లో పూర్తి

‘స్పిరిట్’ చిత్రాన్ని స్టార్ట్‌-టు-ఎండ్‌ షెడ్యూల్‌లో ఆరు నెలల్లో పూర్తి చేయాలని సినిమా యూనిట్‌  ఆలోచిస్తున్నారు. వంగా మార్క్‌లో ఉండే థ్రిల్లింగ్‌ సీక్వెన్స్‌లు, అతీంద్రియ టచ్‌ ఈ సినిమాకి పెద్ద హైలైట్‌గా నిలుస్తాయని తెలుస్తోంది.

ఇది కూడా చదవండి: OG: థమన్ మ్యాజిక్‌తో ‘ఓజి’ హవా!

మనోజ్ నైట్ శ్యామలన్ టచ్‌!

‘స్పిరిట్’ కథ, ప్రెజెంటేషన్‌లో మనోజ్ నైట్ శ్యామలన్‌ తరహా డార్క్‌ సూపర్‌నేచురల్‌ ఎలిమెంట్స్‌ను వంగా అతని స్టైల్ లో చేయబోతున్నారు అంటూ సమాచారం. ఇప్పటి వరకు ఆయన సినిమాలన్నీ ఇంటెన్స్‌ ట్రీట్మెంట్‌తో ఆకట్టుకున్నా, ఈసారి మరింత విభిన్నమైన ప్రయోగం చేయనున్నారని ఇన్ సైడ్ టాక్‌.

‘స్పిరిట్’ తర్వాత ‘యానిమల్ 2’

సందీప్‌ వంగా ప్రస్తుతం పూర్తిగా ‘స్పిరిట్’ మీద దృష్టి సారించారు. ఈ సినిమా పూర్తయ్యిన వెంటనే ‘యానిమల్’ సీక్వెల్‌ పనులను వేగంగా మొదలుపెట్టనున్నట్టు తెలుస్తోంది.

ప్రభాస్‌ కెరీర్‌లో మైలురాయిగా నిలిచే ఈ 25వ సినిమా ‘స్పిరిట్’ ఇప్పటికే భారీ అంచనాలను రేకెత్తించింది. డార్క్‌ సబ్జెక్ట్‌, సూపర్‌నేచురల్‌ యాంగిల్‌, వంగా స్టైల్‌ ప్రెజెంటేషన్‌తో ఈ చిత్రం ఇండియన్‌ సినిమాల్లో మరో క్రేజీ ప్రాజెక్ట్‌గా నిలవడం ఖాయం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *