Palla rajeshwar: కవిత సస్పెన్షన్‌పై పల్లా రాజేశ్వర్ షాకింగ్ కామెంట్స్

Palla rajeshwar: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేయడం పూర్తిగా కార్యకర్తల నిర్ణయమేనని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు. పార్టీ వ్యతిరేక కార్యక్రమాల్లో పాల్గొనడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.

పార్టీకి నష్టం కలిగించే చర్యలు ఎవరు చేసినా వారిపై తప్పనిసరిగా చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. కవిత వ్యాఖ్యల వెనుక కాంగ్రెస్ కుట్ర ఉందని, కల్వకుంట్ల కుటుంబాన్ని చీల్చాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని పల్లా విమర్శించారు.

“ఎంతోమంది వస్తుంటారు… పోతుంటారు. కానీ మాకు కేసీఆర్ ఆదేశాలే శిరోధార్యం” అని పల్లా రాజేశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు.

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *