Pat Cummins

Pat Cummins: ఆస్ట్రేలియా క్రికెట్ జట్టుకు బిగ్ షాక్.. కమిన్స్ ఔట్

Pat Cummins: ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు కెప్టెన్, స్టార్ పేసర్ పాట్ కమిన్స్ గాయం కారణంగా కీలకమైన అంతర్జాతీయ సిరీస్‌లకు దూరమయ్యారు. రాబోయే న్యూజిలాండ్‌, భారత్‌తో జరగనున్న వైట్-బాల్ (పరిమిత ఓవర్ల) మ్యాచ్‌లలో అతను ఆడబోడని క్రికెట్ ఆస్ట్రేలియా (CA) అధికారికంగా ప్రకటించింది. ఇటీవలే జరిగిన వైద్య పరీక్షలలో, కమిన్స్‌కు వెన్ను కింది భాగంలో లుంబార్ బోన్ స్ట్రెస్ ఉన్నట్లు తేలింది. ఈ గాయం తీవ్రమైన ఫ్రాక్చర్ కాకపోయినా, అతనికి విశ్రాంతి చాలా అవసరమని వైద్యులు సూచించారు.క్రికెట్ ఆస్ట్రేలియా ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక ఒక ప్రధాన కారణం ఉంది.

అది ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్. ఈ సంవత్సరం నవంబర్ 21 నుంచి ఇంగ్లాండ్‌తో జరిగే యాషెస్ సిరీస్‌కు పాట్ కమిన్స్ పూర్తిగా ఫిట్‌గా ఉండాలని ఆస్ట్రేలియా బోర్డు కోరుకుంటోంది. అందువల్ల, కమిన్స్ పనిభారాన్ని తగ్గించి, అతను యాషెస్ సిరీస్‌కు పూర్తి సన్నద్ధమయ్యేలా చూసుకోవడమే వారి లక్ష్యం.కమిన్స్ లేకపోవడం ఆస్ట్రేలియాకు ఒక పెద్ద ఎదురుదెబ్బగా పరిగణించవచ్చు. ముఖ్యంగా, భారత్‌తో జరిగే సిరీస్‌లో అతని సేవలు ఎంతగానో అవసరం. అయితే, బోర్డు దీర్ఘకాలిక ప్రణాళికలో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది.

ఇది కూడా చదవండి: KCR: కవితపై కేసీఆర్ కీలక నిర్ణయం.. సస్పెండ్ చేస్తారా? వదిలేస్తారా?

ప్రస్తుతం కమిన్స్ విశ్రాంతి తీసుకుంటూనే, ఫిట్‌నెస్ సాధనలో పాలుపంచుకుంటాడు. కాగా కాగా, ఆస్ట్రేలియా వచ్చే నెలలో తొలుత న్యూజిలాండ్‌ పర్యటనకు వెళ్తుంది. అక్టోబర్‌ 1, 3, 4 తేదీల్లో మౌంట్‌ మాంగనూయ్‌ వేదికగా మూడు టీ20లు ఆడుతుంది. ఆతర్వాత అదే నెల 19 నుంచి భారత్‌ ఆస్ట్రేలియాలో పర్యటిస్తుంది. ఈ పర్యటనలో మూడు వన్డేలు (19, 23, 25), ఐదు టీ20లు (29, 31, నవంబర్‌ 2, 6, 8) జరుగుతాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *