Anushka: తెలుగు సినీ పరిశ్రమలో ‘స్వీటీ’ అనగానే గుర్తుకొచ్చే పేరు అనుష్క శెట్టి ఆమె ‘బాహుబలి’ సినిమాలో తన నటన, స్క్రీన్ ప్రెజెన్స్ వల్లే అభిమానుల్లో ఆమెకు ప్రత్యేక క్రేజ్ ఏర్పడింది. తాజాగా ఆమె నటించిన ఘాటీ సినిమా సెప్టెంబర్ 5న విడుదల కానుంది. ఈ చిత్రాన్ని దర్శకుడు క్రిష్ డైరెక్ట్ చేస్తుండగా, ఇప్పటికే సినిమా నుండి విడుదల అయిన పాటలు, ట్రైలర్ అందులో ఉన్న యాక్షన్ సన్నివేశాలు, క్యారెక్టర్ మధ్య ఉన్న ఎమోషన్స్ ఇప్పటికే ప్రేక్షకుల్లో ఆసక్తిని రేపాయి.
ప్రస్తుతం ప్రమోషన్ కోసం కెమెరాల ముందు రాకుండా ప్రత్యేకంగా కొత్త స్టైల్ ఫాలో అవుతున్న అనుష్క, హీరో రానాతో ఫోన్‌లో మాట్లాడుతూ అభిమానుల మనసులో ఉన్న ప్రశ్నకు సమాధానం చెప్పింది. “ప్రభాస్‌తో మరోసారి సినిమా చేయాలని ఉంది. కానీ ఆ సినిమాకు ‘బాహుబలి’ స్థాయి కంటే గొప్ప స్క్రిప్ట్ దొరకాలి” అలంటి స్క్రిప్ట్ ఎవరైనా తెస్తే అది ప్రభాస్ కి కూడా నచ్చితే నేను చేయదని రెడీ గా ఉన్నాను అని చెప్పింది. ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
బాహుబలి తర్వాత అనుష్క ఎంపికలు
బాహుబలి తర్వాత అనుష్క చాలా సెలక్టివ్‌గా సినిమాలు చేస్తోందని తెలిసిందే. “కథ బాగా నచ్చితేనే ఒప్పుకుంటా” అని ఆమె ఎప్పుడూ చెపుతూ వచ్చారు. అలాగే గత కొన్నేళ్లుగా సినిమా ప్రమోషన్లతో పాటు ఈవెంట్లకు కూడా దూరంగా ఉండటంపై ఆమె వివరణ ఇచ్చింది. “ప్రమోషన్లకు దూరంగా ఉండడం అంటే సినిమాను సీరియస్‌గా తీసుకోకపోవడం కాదని. నేను కొంతకాలం అన్ని ఫంక్షన్లకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నా. ఆ నిర్ణయాన్ని అందరూ గౌరవించి సపోర్ట్ చేశారు” అని చెప్పింది.
ఇది కూడా చదవండి: KCR: కవితపై కేసీఆర్ కీలక నిర్ణయం.. సస్పెండ్ చేస్తారా? వదిలేస్తారా?
ప్రభాస్-అనుష్క కాంబో సాధ్యమేనా?
ప్రభాస్-అనుష్క కాంబోపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. అయితే బాహుబలి స్థాయి కథ రాయడం అంత సులభం కాదు. అంతే కాకుండా ఆ రేంజ్‌లో తీసే సినిమా కోసం దర్శకుడు రాజమౌళి లాంటి విజనరీ అవసరం. రాజమౌళి ప్రస్తుతం మహేష్ బాబుతో ఓ భారీ ప్రాజెక్ట్‌లో బిజీగా ఉన్నాడు. దాని తర్వాత ఆయన మహాభారతంపై దృష్టి పెట్టనున్నట్లు సమాచారం. ఈ షెడ్యూల్‌ను బట్టి చూస్తే బాహుబలి-3 లేదా ప్రభాస్-అనుష్క కాంబినేషన్ త్వరలోనే రిపీట్ అయ్యే అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి.కాకపోతే మహా భారతం లో ప్రభాస్ కి ఎలాగైనా ఛాన్స్ ఇస్తారు రాజమౌళి.. అందులో చాలా క్యారెక్టర్స్ ఉంటాయి కాబట్టి అందులో అనుష్క కి ఛాన్స్ ఉండొచ్చు కాకపోతే.. ఇద్దరి మధ్య ఉండే సన్నివేశాలు ఉంటాయో ఉండవో తెలియదు.
ఘాటీపై భారీ అంచనాలు
ఇక ఘాటీ సినిమా విషయానికి వస్తే, ఇది చిన్న కథ అయినా అన్ని రకాల ఎమోషన్స్‌తో నిండిపోతోందని అనుష్క చెప్పింది. ఇందులో యాక్షన్ సీన్స్ ఎక్కువగా ఉండటంతో ఫిజికల్‌గా కూడా చాలాకష్టం పడ్డానని తెలిపింది. ఈ సినిమాతో పాటు మలయాళంలో మరో సినిమా కూడా పూర్తి చేసానని చెప్పింది.
అంతిమంగా, అనుష్క-ప్రభాస్ కాంబినేషన్‌పై అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నా, బాహుబలి స్థాయి కథ, జక్కన్న లాంటి దర్శకుడి సమయం ఈ కలయికను మళ్లీ తెరపైకి తీసుకురావడంలో కీలకం కానుంది. అప్పటి వరకు అనుష్క అభిమానులు ఆమె రాబోయే ఘాటీ సినిమాతో సంతృప్తి చెందాల్సి ఉంటుందనడంలో సందేహం లేదు.
