Jagan Munchadu: జగన్ నిండా ముంచేసాడు… ఆదుకోండి ప్రభో అంటున్నారు కడప జిల్లా వైసీపీ ప్రతినిధులు. వైసీపీ హయాంలో కాంట్రాక్ట్ పనులు చేసి, బిల్లులు రాక అన్యాయం అయిపోయాం అంటూ స్వయానా వైసీపీ జెడ్పీటీసీ సభ్యులే గగ్గోలు పెడుతున్నారు. జెడ్పీటీసీ సర్వసభ్య సమావేశంలో తమ గోడును వెల్లబోసుకున్నారు. జగన్ హయాంలో చేసిన కాంట్రాక్టు బిల్లుల్ని అప్పటి ప్రభుత్వం చెల్లించలేదని, కూటమి ప్రభుత్వమే తమని ఆదుకోవాలని వేడుకుంటున్నారు. కాంట్రాక్ట్ బిల్లులు ఇవ్వకపోతే ఆత్మహత్యలే శరణ్యం అంటున్నారు వైసీపీ జెడ్పీటీసీలు.
Also Read: Pawan Kalyan: ఒక్క రోజు జనసేన నేషనల్ పార్టీ అవుతుంది
కోట్ల రూపాయలు కాంట్రాక్టులు చేస్తే బిల్లులు ఇవ్వకుండా జగన్ ప్రభుత్వం మోసం చేసిందని.. ఏకంగా ఎమ్మెల్సీ గోవిందరెడ్డి స్వయానా తమ్ముడు కాశినాయన జెడ్పీటీసీ మెంబర్ సత్యనారాయణ రెడ్డి.. సర్వసభ్య సమావేశంలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. కాంట్రాక్టర్ అంటే పిల్లనిచ్చే పరిస్థితి కూడా లేదని మరో జెడ్పీటీసీ సభ్యుడు వాపోయిన పరిస్థితి. ఇలా జగన్ సొంత జిల్లాలోనే కోట్ల రూపాయల కాంట్రాక్టు వర్కులు చేసిన వందలాది మంది వైసీపీ ప్రతినిధుల పరిస్థితి నేడు అగమ్య గోచరంగా మారింది. వీరంతా ఇప్పుడు కూటమి ప్రభుత్వమైనా బిల్లులు మంజూరు చేసి ఆదుకోవాలంటూ రోదిస్తున్న పరిస్థితి.
