Avneet Kaur: భారత క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లీ, నటి అవ్నీత్ కౌర్‌కు అనుకోకుండా లైక్ చేసిన సంఘటన ఇంటర్నెట్‌లో పెద్ద చర్చకు దారితీసిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో ఇప్పటికే కోహ్లీ వివరణ ఇవ్వగా, తాజాగా అవ్నీత్ కౌర్ కూడా స్పందించారు. తన కొత్త చిత్రం “లవ్ ఇన్ వియత్నాం” ప్రమోషన్స్లో భాగంగా ఆమె ఈ విషయంపై నవ్వుతూ సమాధానం ఇచ్చారు.
విరాట్ కోహ్లీ లైక్‌తో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చిన నటి అవ్నీత్ కౌర్ ఈ వివాదంపై మొదటిసారిగా మాట్లాడారు. తన రాబోయే చిత్రం “లవ్ ఇన్ వియత్నాం” ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ, నెటిజన్‌లతో పాటు సినీ ప్రముఖులు కూడా తనపై ప్రేమ చూపుతున్నారని అన్నారు. కోహ్లీ లైక్‌పై నేరుగా కాకుండా పరోక్షంగా స్పందిస్తూ, “ప్రేమ దొరుకుతూనే ఉండాలి, నేను ఈ మాటకు మించి చెప్పలేను” అంటూ నవ్వుతూ సమాధానమిచ్చారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
విరాట్ కోహ్లీ అనుకోకుండా అవ్నీత్ కౌర్ పోస్ట్‌ను లైక్ చేయడంతో, ఆమెకు కేవలం కొన్ని గంటల్లోనే రెండు మిలియన్ల మంది ఫాలోవర్స్ పెరిగారు. దీనితో ఆమె జీవితం పూర్తిగా మారిపోయింది. ఫాలోవర్స్ పెరగడమే కాకుండా, 12 కొత్త బ్రాండ్లకు ప్రమోషన్ కోసం ఆమె ఒప్పందం చేసుకున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. ఒక చిన్న లైక్ ఆమె కెరీర్‌ను అమాంతం మార్చేసింది.
Also Read: Rajinikanth: రజనీకాంత్‌తో నాగ్ అశ్విన్ భారీ ప్రాజెక్ట్ !
విరాట్ కోహ్లీ వివరణ
ఈ లైక్‌పై విరాట్ కోహ్లీ గతంలోనే తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా స్పష్టత ఇచ్చారు. తన ఫీడ్‌ను క్లియర్ చేస్తుండగా అల్గారిథం పొరపాటు వల్ల లైక్ బటన్ నొక్కినట్లు ఆయన తెలిపారు. దీని వెనుక ఎలాంటి ఉద్దేశం లేదని, అనవసర ఊహాగానాలు చేయవద్దని కోరారు. “మీ అవగాహనకు ధన్యవాదాలు” అంటూ ఆయన ఈ వివాదానికి ముగింపు పలికే ప్రయత్నం చేశారు. అయితే, కోహ్లీ వివరణ తర్వాత కూడా ఈ విషయంపై చర్చలు కొనసాగాయి.
ఈ మొత్తం వ్యవహారంపై పలువురు సెలబ్రిటీలు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. పొరపాటున జరిగిన ఒక చిన్న సంఘటనను మీడియా, నెటిజన్లు అనవసరంగా పెంచి రాశారని విమర్శించారు. సోషల్ మీడియాలో ప్రజలు అనవసరంగా సమయం వృథా చేస్తున్నారని అభిప్రాయపడ్డారు. అయినప్పటికీ, అవ్నీత్ తాజా వ్యాఖ్యలు ఈ విషయంపై మరోసారి చర్చను లేవనెత్తాయి.
