Narayana swamy: లిక్కర్ కేసులో తనపై చేస్తున్న ఆరోపణలను మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి ఖండించారు. “సిట్ ఎన్నిసార్లు విచారణకు పిలిచినా నేను సిద్ధంగా ఉంటాను. ప్రభుత్వ మద్యం దుకాణాల వల్ల అవినీతి జరగదు. కుట్రలో భాగంగానే మా నేతలను అరెస్ట్ చేస్తున్నారు” అని ఆయన అన్నారు. ఏపీ బేవరేజస్ అధికారుల నియామకంలో తనకు ఎలాంటి పాత్ర లేదని స్పష్టం చేశారు. “లిక్కర్ కేసుతో నాకు సంబంధం లేదు. సిట్ అడిగిన అన్ని ప్రశ్నలకు జవాబిచ్చా. కానీ నా మాట వినేవారు ఎవరూ లేరు” అని నారాయణస్వామి ఆవేదన వ్యక్తం చేశారు.
