Surat:

Surat: సూర‌త్ డైమండ్ కంపెనీలో భారీ చోరీ.. ఆల‌స్యంగా గుర్తింపు

Surat: గుజ‌రాత్ రాష్ట్రంలోని సూర‌త్ న‌గ‌రంలో భారీ చోరీ జ‌రిగింది. అక్క‌డి ఓ డైమండ్ కంపెనీలో భారీ వ‌జ్రాల చోరీ ఘ‌ట‌న చోటుచేసుకున్న‌ది. ఈ ఘ‌ట‌నను ఆ కంపెనీ యాజ‌మాన్యం ఆల‌స్యంగా గుర్తించింది. మ‌ధ్య‌న మూడు రోజులు సెలువులు రావ‌డంతో, సెల‌వుల అనంత‌రం కంపెనీ తెరిచే స‌రికి చోరీ ఘ‌ట‌న వెలుగులోకి వ‌చ్చింది.

Surat: సూర‌త్ న‌గ‌రంలోని డీకే అండ్ స‌న్స్ డైమండ్ కంపెనీలో భారీ వ‌జ్రాల చోరీ జ‌రిగింద‌ని గుర్తించారు. ఆగ‌స్టు నెల‌లో 15వ తేదీ నుంచి 17వ తేదీ మ‌ధ్య వ‌రుస‌గా మూడు రోజుల‌పాటు సెలువు రావ‌డంతో కంపెనీని మూసి ఉంచారు. ఈ స‌మయంలోనే గుర్తు తెలియ‌ని దుండ‌గులు కంపెనీలోకి చొర‌బ‌డి ఉంటార‌ని కంపెనీ యాజ‌మాన్యం తెలిపింది.

Surat: కంపెనీ ప్ర‌ధాన డోర్‌ను బ‌ద్ద‌లు కొట్టి మూడో ఫ్లోర్‌ని మెట‌ల్ సేప్ గ్యాస్ క‌ట్ట‌ర్‌తో తెరిచి దాదాపు రూ.25 కోట్ల విలువైన వ‌జ్రాల‌ను దుండ‌గులు దోచుకున్నార‌ని గుర్తించారు. అప‌హ‌ర‌ణ స‌మ‌యంలో దుండ‌గులు కంపెనీలోని సీసీ కెమెరాల‌ను కూడా ధ్వంసం చేసిన‌ట్టు పోలీసులు గుర్తించారు. ఈ ఘ‌ట‌న షాక్‌కు గురి చేసింది.

Surat: మ‌న దేశంలో గుజ‌రాత్ వ‌జ్రాల‌కు ప్ర‌సిద్ధి. ముఖ్యంగా సూర‌త్ న‌గ‌రం ప్ర‌ధాన కేంద్రం. అక్క‌డే ప‌లు వ‌జ్రాల కంపెనీలు ఉన్నాయి. ఇక్క‌డి నుంచి వ‌జ్రాలు దేశ‌, విదేశాల‌కు ఎగుమ‌తి, దిగుమ‌తి అవుతుంటాయి. తాజాగా భారీ వ‌జ్రాల అప‌హ‌ర‌ణ జ‌ర‌గ‌డం అక్క‌డి వ్యాపారుల‌కు తీవ్ర ఆందోళ‌న‌కు గురి చేస్తున్న‌ది. భ‌ద్ర‌తా చ‌ర్య‌ల‌పై ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతున్న‌ది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *