Rs praveen: కాళేశ్వరం ప్రాజెక్టుపై ఆర్ఎస్ ప్రవీణ్ సంచలన వ్యాఖ్యలు

Rs praveen: బీఆర్‌ఎస్ నేత ఆర్‌.ఎస్‌. ప్రవీణ్‌ కాళేశ్వరం ప్రాజెక్టు విషయమై సంచలన వ్యాఖ్యలు చేశారు. మేడిగడ్డ బ్యారేజ్‌ కుంగిపోవడం సహజసిద్ధం కాదని, దీని వెనుక కుట్ర ఉందని ఆయన ఆరోపించారు. “కాళేశ్వరం ప్రాజెక్టును పేల్చివేసే ప్రయత్నం జరిగింది. మేడిగడ్డ బ్యారేజ్‌ కుంగితే శబ్దాలు రావు. కానీ అక్కడ పేలుళ్ల శబ్దాలు వినిపించాయని స్థానికులు చెబుతున్నారు” అని ప్రవీణ్ అన్నారు.

అసాంఘిక శక్తులు ఎవరో తేల్చాలని డిమాండ్ చేసిన ఆయన, “రేవంత్ రెడ్డి, బండి సంజయ్‌, కిషన్ రెడ్డి ఫోన్‌ డేటాను చెక్ చేస్తే వెంటనే నిజం బయటపడుతుంది” అని అన్నారు.

మేడిగడ్డ దగ్గర వినిపించిన పేలుళ్ల శబ్దాలపై ఇప్పటివరకు NDSA (జాతీయ ఆనకట్ట భద్రతా సంస్థ) స్పందించకపోవడంపై ఆయన ప్రశ్నలు లేవనెత్తారు.

 

 

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Gold Rates Today: తగ్గినట్టే తగ్గి.. భగ్గుమన్న బంగారం.. వెండి ధరలు నిలకడగా.. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *