AP Rains: బంగాళాఖాతంలో కొత్త వాతావరణ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ప్రస్తుతం అక్కడ ఒక ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇది రానున్న 24 గంటల్లో అల్పపీడనంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ అల్పపీడనం మరో రెండు రోజుల్లో మరింత బలపడి తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉంది.
కోస్తాంధ్రకు వర్ష సూచన
ఈ అల్పపీడనం కారణంగా కోస్తాంధ్ర జిల్లాలలో వారం రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్నిచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
గంటకు 50 కి.మీ. వేగంతో గాలులు
అల్పపీడనం బలపడటంతో తీరం వెంబడి గంటకు 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. ఈ కారణంగా సముద్రం అల్లకల్లోలంగా మారే అవకాశం ఉంది. కాబట్టి మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని, ఇప్పటికే సముద్రంలో ఉన్నవారు వెంటనే తీరానికి తిరిగి రావాలని అధికారులు హెచ్చరించారు.
