America: అమెరికాలో రెండు విమానాలు ఢీకొన్న ఘటనలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. పలు విమానాలు దెబ్బతిన్నాయి. ఈ ఘటన ఆ దేశంలోని కాలిస్పెల్ సిటీలోని మోంటానా విమానాశ్రయంలో జరిగింది. పార్క్ చేసిన ఓ విమానంపైకి మరో చిన్న విమానం దూసుకెళ్లడంతో ఈ ప్రమాదం చోటుచేసుకున్నది. ఈ ఘటనలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి.
America: విమానాలు ఢీకొన్న ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి తీవ్ర ప్రమాదాలు చోటుచేసుకోలేదు. విమానంలో ఉన్న పైలట్ సహా నలుగురు ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. ఇద్దరు ప్రయాణికులకు స్పల్పగాయాలయ్యాయి. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే అదే సమయంలో ఘటనా స్థలికి పక్కనే ఉన్న పలు విమానాలు దెబ్బతిన్నాయి.
America: కాలిస్పెల్ సిటీ పోలీస్ చీఫ్ జోర్డాన్ వెనెజియో, ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ ప్రకారం.. నలుగురు వ్యక్తులతో ప్రయాణిస్తున్న సింగిల్ ఇంజిన్ విమానం.. కాలిస్పెల్ నగర విమానాశ్రయంలో ల్యాండ్ అవడానికి ప్రయత్నిస్తుండగా, ఆ సమయంలో అక్కడే ఆగి ఉన్న మరో విమానానికి అది ఢీకొన్నది. ఈ ఘటనతో మంటలు అంటుకున్నాయి. ఆ మంటలు ఇతర విమానాలకు కూడా అంటుకున్నాయని తెలిపారు.
