KTR

KTR: ఫోన్ ట్యాపింగ్ వివాదం.. బండి సంజయ్‌కు కేటీఆర్ లీగల్ నోటీసులు

KTR: తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మరింత వేడెక్కింది. ఈ కేసులో తమపై నిరాధార ఆరోపణలు చేశారని ఆరోపిస్తూ, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. బీజేపీ ఎంపీ బండి సంజయ్‌కి లీగల్ నోటీసులు పంపారు.

కేటీఆర్ తరపు న్యాయవాది ద్వారా మంగళవారం ఈ నోటీసులు జారీ అయ్యాయి. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్‌కు ప్రత్యక్ష సంబంధం ఉందని, అందులో ఆయన పాత్ర ఉందని బండి సంజయ్ బహిరంగంగా ఆరోపణలు చేశారు. ఈ వ్యాఖ్యలు పూర్తిగా అవాస్తవం, నిరాధారమైనవని కేటీఆర్ లీగల్ నోటీసులలో పేర్కొన్నారు.

బండి సంజయ్ చేసిన ఆరోపణలు తన వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించాయని, తక్షణమే వాటిని ఉపసంహరించుకుని క్షమాపణ చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. లేనిపక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ లీగల్ నోటీసులు తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపాయి. ఈ వివాదం రానున్న రోజుల్లో ఏ మలుపు తిరుగుతుందో చూడాలి.

KTR

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *